alok kumar
-
హిందువులకు అప్పగించండి: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే మరోసారి రూఢీ చేసినందున ఆ ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. శివలింగం లభించిన వజూ ఖానాగా చెబుతున్న చోట హిందువులకు పూజలకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. -
జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆదివారం చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహా్వనించనున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారం¿ోత్సవానికి సన్నాహకంగా ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 15 దాకా లక్షలాది గ్రామాల్లో ‘శౌర్యయాత్ర’లు నిర్వహించేందుకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. -
ఫోన్‌ట్యాపింగ్ దుమారం: రంగంలోకి సీబీఐ
బెంగళూరు: బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు గురువారం దాడులు నిర్వహిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఆయన నివాసంలో సీబీఐ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అలోక్ కుమార్ ప్రస్తుతం కర్ణాటక స్టేట్ రిజర్వు పోలీసు అదనపు డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కుమారస్వామి ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొని.. అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. పలువురు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారు. ఈ రాజకీయ సంక్షోభ సమయంలో అప్పటి సీఎం కుమారస్వామి తమ ఫోన్లను ట్యాప్ చేశారని పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ క్లిప్ మీడియాకు లీక్ కావడంతో ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ ఆడియో క్లిప్‌లో ఓ ఐపీఎస్ అధికారి పేరుతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ తదితరులు పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. విచారణను చేపట్టింది. గత కుమారస్వామి ప్రభుత్వం తనతోపాటు మరో 300 మంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని అన్హరత వేటుకు గురైన జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ ఆరోపించడం సంచలనం రేపింది. కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కోరుతుండగా.. దీని వెనుక ఉన్నది కుమారస్వామియేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. -
కళ్లు పీకేస్తా జాగ్రత్త!
సాక్షి, బెంగళూరు : లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన కఠినంగా అణచివేస్తామని నేర విభాగం అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ రౌడీలను హెచ్చరించారు. పోలీసులు నిన్న (శుక్రవారం సాయంత్రం) 250 మందితో పరేడ్ నిర్వహించి తమదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లు కుణిగల్‌గిరి, సైలెంట్ సునీల్, శివాజీనగర తన్వీర్‌తో పాటు 250 మందికిపైగా రౌడీలను వరుసగా నిలబెట్టి అలోక్ కుమార్ హెచ్చరించారు. ఇదే సమయంలో రౌడీషీటర్ సైలెంట్ సునీల్ వద్దకు రాగానే ‘ఏంటి అలా చూస్తున్నావ్ కళ్లు పీకేస్తా అంటూ కొట్టడానికి చెయ్యి పైకెత్తారు. చెవి పిండుతూ సక్రమంగా నిలబటం నేర్చుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులతో ఇతనిపై నిరంతరం నిఘా పెట్టండి అంటూ ఆదేశించారు. అనంతరం కుణిగల్ గిరిని ప్రశ్నించిన అలోక్‌కుమార్ ఐపీఎల్ బెట్టింగ్ ఎంత డబ్బు గెలిచావు బెట్టింగ్ పెడతావా అని ప్రశ్నించారు. మొదట బెట్టింగ్ ఆడలేదని వాదించిన కుణిగల్ గిరి చివరికి బెట్టింగ్ ఆడుతున్నట్లు ఒప్పుకుని రూ.2 లక్షల వరకు గెలిచినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. రౌడీల పరేడ్ ముగిసిన అనంతరం రౌడీషీటర్లు సీసీబీ కార్యాలయం నుంచి వెళ్లినప్పటికీ సైలెంట్ సునీల్‌ను పోలీస్ అధికారులు రాత్రి 10 గంటల వరకు విచారణ చేపట్టారు. జుట్టు కత్తిరించుకుని వాట్సాప్‌లో ఫోటోలు పెట్టాలి గుబురుగడ్డం, భారీ జులపాలతో ఉన్న కొందరు రౌడీలను హెచ్చరించిన అలోక్‌కుమార్ వెంటనే జట్టు కత్తిరించుకుని పోలీసులకు వాట్సాప్‌లో ఫొటోలు, ఫోన్ నెంబర్లు ఇవ్వాలని ఆదేశించారు. -
అయోధ్యపై వీహెచ్‌పీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా ఆగింది. ‘రామమందిర నిర్మాణ అంశం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రబిందువుగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మా భవిష్యత్ కార్యచరణను వెల్లడిస్తాం’ అని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించేందుకు వీలుగా బీజేపీ సర్కారు పార్లమెంటులో చట్టం తేవాలనే డిమాండ్‌తో వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ‘రామజన్మభూమి ఉద్యమం’ను ఉధృతం చేయడం తెల్సిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ, అన్ని పార్టీల ముఖ్యనాయకులను వీహెచ్‌పీ నేతలు కలుస్తున్నారు. నరేంద్ర మోదీ సర్కారుకు ఇబ్బందులు రాకూడన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. తమకు బీజేపీ మినహా ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. -
గాలి జనార్దన రెడ్డి అరెస్టు
సాక్షి బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి యాంబిడంట్ కంపెనీ ముడుపుల కేసులో అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు శనివారం సాయంత్రమే జనార్దన రెడ్డి బెంగళూరులోని సీసీబీ (కేంద్ర నేర విభాగం) పోలీసు కార్యాలయానికి రావడం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి 2 గంటల వరకు జనార్దన రెడ్డిని ప్రశ్నించామనీ, ఆదివారం ఉదయం కూడా విచారణను కొనసాగించి 9 గంటల సమయంలో అరెస్టు చేశామని అదనపు పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పారు. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు చేయించి, 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా 24 వరకు జనార్దన రెడ్డికి జ్యుడీíషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో ఆయనను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఐపీసీ సెక్షన్లు 120, 204, 420లకింద కేసులు నమోదు చేశారు. కాగా జనార్దన రెడ్డికి, యాంబిడంట్ సంస్థకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన తరఫు న్యాయవాది చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కాగా, ఇదే కేసులో పోలీసుల అదుపులో ఉన్న జనార్దన రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను ఆదివారం విడుదల చేశారు. అయితే తన యజమాని అరెస్టయినందున తాను కూడా జైలులోనే ఉంటానని అలీఖాన్ చెప్పడం గమనార్హం. ఏమిటీ యాంబిడంట్ కేసు? 2016లో సయ్యద్ అహ్మద్ ఫరీద్ అనే బడా వ్యాపారి ఆధ్వర్యంలో యాంబిడంట్ పేరుతో గొలుసుకట్టు పెట్టుబడుల వ్యాపారం ప్రారంభమైంది. నాలుగు నెలలకే పెట్టుబడిపై 50 శాతం రాబడి ఉంటుందంటూ రూ. 600 కోట్లను రాబట్టి అనంతరం చేతులెత్తేసింది. ఈడీ, ఐటీ అధికారులు ఫరీద్‌పై కేసులు నమోదు చేశారు. వీటి నుంచి బయటపడేస్తానంటూ జనార్దన రెడ్డి తన పీఏ ద్వారా ఫరీద్‌తో రూ. 25 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. ఇందులో భాగంగా రూ.18 కోట్లను చెందిన బంగారం వ్యాపారి రమేష్ కొఠారి ఖాతాకు జమ చేశారని తేలింది. ఆ సొమ్ముతో 57 కిలోల బంగారం కొన్నారు. రమేష్‌ను విచారణ చేయగా అలీఖాన్‌కు బంగారం అందించినట్లు చెప్పాడు. -
సీబీఐకి పరీక్షాసమయం
చేసిన తప్పులు శాపాలై వెంటాడతాయని సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్‌సిన్హాకు ఆలస్యంగా అర్ధమై ఉంటుంది. బొగ్గు కుంభకోణం దర్యాప్తును రంజిత్ ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న అభియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనపై పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించడం ఆ సంస్థకు, ప్రత్యేకించి కొత్తగా దాని సారథ్య బాధ్యతలు స్వీకరించిన అలోక్ కుమార్ వర్మకు అగ్నిపరీక్షలాంటిది. గత కొన్నేళ్లుగా సీబీఐ తీరుతెన్నులు ప్రజాస్వామికవాదుల్ని కలవరపరుస్తున్నాయి. అది పాలకుల చేతిలో పనిముట్టుగా మారిందని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించినా, సక్రమంగా వ్యవహరించాలని హెచ్చరించినా దానిలో మార్పు రాలేదు. దేశంలోని దర్యాప్తు సంస్థలన్నిటికీ తలమానికంగా ఉండాల్సిన ఆ సంస్థ పాలకుల చేతిలో కీలుబొమ్మ అయింది. దేశాన్ని పట్టి కుదిపిన లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాన్ని దర్యాప్తు చేయమని సర్వో న్నత న్యాయస్థానం ఆదేశిస్తే... ఆ దర్యాప్తు క్రమాన్నే కుంభకోణంగా మార్చిన ఘనత సీబీఐదే! బొగ్గు కుంభకోణంలో సుప్రీంకోర్టుకు ఎప్పటికప్పుడు అందించాల్సిన పురో గతి నివేదికలను అంతకన్నా ముందు నిందపడినవారికే చూపుతున్నదని మీడియా వెల్లడించినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. అందులో ఆవగింజంత నిజం కూడా లేదని వాదిస్తూ వచ్చిన సీబీఐ తీరా ఆ మాటే అఫిడవిట్ రూపంలో ఇవ్వా లని సుప్రీంకోర్టు ఆదేశించాక లొంగివచ్చింది. ‘చూపించడం నిజమే...ఇకపై ఆ పని చేయబోమని రంజిత్‌సిన్హా అంగీకరించాల్సి వచ్చింది. ఆ చూపినవేమిటో కాస్త వివ రించమని నిలదీశాక పరువు బజారున పడింది. ఫలానా అఫిడవిట్లో ఫలానా వాక్యాలు మారాయని సీబీఐ ఇచ్చిన జాబితాను అధ్యయనం చేశాక నివేదిక మౌలిక స్వరూపమే మారిపోయిందని న్యాయమూర్తులు నిర్ధారణకొచ్చారు. ఇదింకా చల్లా రకముందే సీబీఐ విశ్వసనీయతనూ, ప్రత్యేకించి రంజిత్‌సిన్హా వ్యక్తిత్వాన్ని ప్రశ్నా ర్ధకం చేసే మరో కథనం వెలుగులోకొచ్చింది. వివిధ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నవారు ఆయనను వచ్చి కలుస్తున్నారని ప్రశాంత్‌భూషణ్ నేతృత్వంలోని కామన్ కాజ్ సంస్థ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. అదంతా అబద్ధమని, తన ఇంటి వద్ద ఉంచే లాగ్ బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కావాలని కొందరి పేర్లు చేర్చారని మొదట్లో కొట్టిపారేసిన సిన్హా, ‘అలా కలిస్తే తప్పేముంది... నా ఇంటి తలుపులు ఎవరికైనా తెరిచే ఉంటాయ’ని చెప్పేవరకూ వచ్చారు. పైగా ఆ వచ్చినవారు కేసుల్లో నిందితులైతే కావొచ్చు... అంతకన్నా ముందు వారు నా స్నేహితులు అని అడ్డగోలు వాదన మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ అంశంలోనే సుప్రీంకోర్టు రంజిత్సిన్హాపై దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ స్థాయి అత్యున్నత సంస్థకు సారథ్యం వహించిన మాజీ డైరెక్టర్‌పై కేసు పెట్టి దర్యాప్తు జరపాలనడం దేశ చరిత్రలో ఇది తొలిసారి. ఇది ప్రస్తుత డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మకు వ్యక్తిగతంగా కూడా పెద్ద సవాలే. ఎందుకంటే ఆ దర్యా ప్తునకు నేతృత్వం వహించాల్సింది ఆయనే. అయితే ఉన్నంతలో సుప్రీంకోర్టు సీబీఐ పరువు నిలిపినట్టే. ఎందుకంటే ఈ దర్యాప్తును మరో సంస్థకు అప్పజెప్పి ఉంటే సీబీఐకి అదో మచ్చగా మిగిలిపోయేది. సర్వోన్నత న్యాయస్థానం దాన్ని విశ్వ సించడం లేదన్న సందేశం వెళ్తే ఆ సంస్థ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లేది. తన మాజీ డైరెక్టర్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకపోవచ్చునన్న సందేహాలను కొట్టిపారేస్తూ సారథి మారారు గనుక సంస్థపై తమకు నమ్మకమున్నదని న్యాయమూర్తులు చెప్పారు. దాన్ని సీబీఐ నిలబెట్టుకోగ లుగుతుందా? ఇది ఆ సంస్థకు జీవన్మరణ సమస్య. సిన్హా తప్పు చేశారని న్యాయ మూర్తులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఆ విషయంలో మరింత కూలంక షంగా దర్యాప్తు జరపాలని భావించారు. నిజానికి రంజిత్‌సిన్హా నియామకం సమ యంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని, విపక్ష నేత తదితరులుండే కమిటీ ద్వారానే అత్యున్నత స్థాయి సంస్థల సారథులను ఎంపిక చేయాలన్న ప్రతి పాదన రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం హడా వుడిగా రంజిత్ నియామకాన్ని పూర్తి చేసింది. సీబీఐని అధికారంలో ఉన్నవారు పంజరంలో చిలుకగా మార్చారని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని తనకు విస్తృత అధికారాలు రావడం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. సంస్థ డైరెక్టర్‌కు సంపూర్ణ అధికారాలిస్తే తప్ప సమర్ధవంతంగా పనిచేయడం సాధ్యపడదని సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో చెప్పారు. అలా చెప్పిన వ్యక్తి అందుకు తగ్గట్టు ఉన్నత వ్యక్తిత్వాన్ని కనబరిస్తే, విశ్వసనీయతను సాధించే విధంగా ప్రవర్తిస్తే వేరుగా ఉండేది. కానీ సిన్హా పనితీరు అడుగడుగునా సందేహాలనే మిగిల్చింది. అయితే ఇది కేవలం సీబీఐకి, రంజిత్‌సిన్హాకు మాత్రమే సంబంధించిన, పరిమితమైన సమస్య కాదు. దేశంలో దాదాపు అన్ని సంస్థల పనితీరు అలాగే ఉంటున్నది. వాటి సారథులు ఆ సంస్థల పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. నిజానికి అలాంటి ‘సమర్థత’ ఉన్నవారికే ఉన్నత పదవులొస్తున్నాయి. అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి. ఈ ధోరణిని ఆపాలంటే ఎక్కడో ఒకచోట కఠినంగా వ్యవహరించక తప్పదు. నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకోక తప్పదు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణమైనా, బొగ్గు కుంభకోణమైనా స్వయంగా సుప్రీం కోర్టే పర్యవేక్షించిన కేసులు. కనీసం అందుకోసమైనా జాగ్రత్తగా వ్యవహరించాలని, నింద పడకుండా చూసుకోవాలని సీబీఐగానీ, రంజిత్సిన్హాగానీ అనుకోలేదు. పాలకుల కటాక్షవీక్షణాలుంటే తమకేమీ కాదన్న భరోసాయే దీనికి కారణం. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అలాంటి మనస్తత్వం ఉన్నవారిలో నిస్సం దేహంగా పరివర్తన తీసుకొస్తాయి. ప్రజాస్వామ్యంలో తాము ఎవరికి జవాబు దారీగా ఉండాలో, తమ విధులను ఎంత జాగ్రత్తగా నిర్వహించాలో గ్రహించేలా చేస్తాయి. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సీబీఐదే. -
నల్లగొండలో చేనేత అభివృద్ధి కమిషనర్ పర్యటన
చౌటుప్పల్: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో 31 చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జాతీయ చేనేత అభివృద్ధి కమిషనర్ అలోక్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం రూ.2 కోట్ల చొప్పున కేటాయింపులు జరిగాయని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని చేనేత మగ్గాలను పరిశీలించారు. వస్త్రాల తయారీని స్వయంగా చూసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
భగ్గుమన్న వర్గపోరు
అర్ధంతరంగా నిలిచిన పాలికె సౌధ ప్రారంభోత్సవం పోలీసుల అదుపులో బీబీఎంపీ కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి నాగరబావిలో 144 సెక్షన్ అమలు బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఆదివారం భగ్గుమన్నాయి. ఫలితంగా ప్రజాసౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉద్యానవనం, పాలికె సౌధ ప్రారంభం వాయిదా పడింది. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని బెంగళూరు నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్, డీసీపీ లాబూరామ్ పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. వివరాల్లోకి వెళితే... గోవిందరాజనగర నియోజవర్గంలో చంద్రగిరి ఉద్యానవనం, పాలికె సౌధను బీబీఎంపీ నిధులతో నాగవార పాలికె వార్డు కార్పొరేటర్ ఉమేష్ శెట్టి నిర్మించారు. అత్యంత సుందరంగా రూపొందిన ఈ పార్క్‌ను ఆగష్టు 16, 24 తేదీలలో ప్రారంభించాలని అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేడుకలు వాయిదా పడ్డాయి. ఆదివారం పాలికె సౌధతో పాటు పార్క్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్, స్థానిక ఎమ్మెల్యే ప్రియాకృష్ణను కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సభా ఏర్పాట్లను ఉమేష్‌శెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు పోలీసులు, ఎమ్మెల్యే ప్రియాకృష్ణ(కాంగ్రెస్) అనుచరులు చేరుకున్నారు. ఉమేష్శెట్టితో ఎమ్మెల్యే అనుచరులు వాదనకు దిగారు. గొడవ ఎక్కువ కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉమేష్శెట్టిని అదుపులోకి తీసుకుని కేఎస్ఆర్పీ మైదానంలోకి తీసుకెళ్లారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు : బీబీఎంపీ నిధులతో అభివృద్ది చేసిన చంద్రగిరి పార్క్, పాలికె సౌధల ప్రారంభోత్సవాల వేడుకలను స్థానిక నాగరబావి కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని స్థానిక శాసన సభ్యుడు ప్రియాకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలికె నిధులతో ఏర్పాటు చేస్తే బీజేపీ నాయకులను పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కనీసం తనను ఈ కార్యక్ర మానికి ఆహ్వానించలేదని మండిపడ్డారు. నాగరబావి వార్డు కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి మాట్లాడుతూ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. నాగరబావి వార్డు అభివృద్ది చెందడం స్థానిక శాసన సభ్యుడు ప్రియాకృష్ణకు ఇష్టం లేదని మండిపడ్డారు. -
బెంగళూరు పోలీసు కమిషనర్, ఏసీపీ బదిలీ
బెంగళూరు: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ ఆందోళనలు అధికమవుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ను బదిలీ చేసింది. నగరంలో శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారనే కారణంతో ఆయనపై బదిలీ వేటు వేసింది. ఔరాద్కర్ బదిలీకి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమోదముద్ర వేశారు. ఆయనను రాష్ట్ర రిజర్వు పోలీసు విభాగానికి అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అలాగే ఏసీపీ(శాంతిభద్రతలు) కమల్ పంత్ కూడా మానవ హక్కుల విభాగానికి బదిలీ చేశారు. ఔరాదక్కర్ స్థానంలో ఎంఎన్ రెడ్డిని నూతన కమిషనర్ గా నియమించారు. అలోక్ కుమార్ ను ఏసీపీగా నియమించింది. -
ప్రపంచ బిలియర్డ్స్ ఫైనల్లో అలోక్
లీడ్స్: భారత ఆటగాడు అలోక్ కుమార్ ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో అతను 5-1 ఫ్రేమ్‌ల తేడాతో సహచరుడు దేవేంద్ర జోషిపై విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఈ పోరులో అలోక్ 150-52, 150-34, 117-150, 150-37, 150-116, 150-138తో జోషిపై గెలుపొందాడు. ఫైనల్లో భారత ఆటగాడు... ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ కాసియెర్తో తలపడతాడు. మరో సెమీస్‌లో కాసియెర్ 5-1 (150-46, 79-150, 150-37, 150-27, 150-28, 150-7) ఫ్రేమ్‌ల తేడాతో ఇంగ్లండ్‌కే చెందిన రాబర్ట్ హాల్‌ను కంగుతినిపించాడు. -
12 గంటల్లోనే హత్యకేసు పరిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ: హత్యచేసిన 12 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు రాజేందర్‌నగర్ పోలీసులు. నిందితులను యూపీలోని బులందర్‌కి చెందిన దీపక్‌కుమార్, బంటీకుమార్‌గా గుర్తించినట్టు సెంట్రల్ జిల్లా డీసీపీ అలోక్‌కుమార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.లక్ష 57వేల రూపాయల నగదు,రెండు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు..తన పనిమనిషి హత్య జరిగినట్టు ఓల్డ్రాజేందర్నగర్కి చెందిన రవిందర్‌సింగ్ అనే వ్యక్తి నుంచి మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో రాజేందర్‌నగర్ పోలీసులకు పీసీఆర్ ఫోన్ వచ్చిం ది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మొదటి అంతస్థులో ఉన్న భగవాన్ శవం కనిపించింది. ఆధారాలు సేకరించడంతోపాటు అనుమానితుల సమాచారం సేకరించారు. బంటీ,దీపక్‌కుమార్‌లు హత్యచేసి ఉంటారన్న సమాచారంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షతోనే భగవాన్‌దాస్‌ను హత్యచేసినట్టు దీపక్ ,బంటీ అంగీకరించాడు. ప్రస్తుతం భగవాన్‌దాస్ ఉద్యోగంలో దీపక్ పనిచేసేవాడు. దీపక్ పెళ్లికోసమని ఇంటికి వెళ్లివచ్చేప్పటికే అతడి యజ మాని రవిందర్‌సింగ్ దీపక్‌ను తొలగించి భగవాన్‌దాస్‌ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న దీపక్, అదే చోట పనిచేస్తున్న బంటీతో కలిసి హత్యకు పథకం వేశాడు. యజమాని ఇంట్లోచోరీ చేసి ఆనేరాన్ని భగవాన్దాస్పై నెట్టాలని ఇద్దరూ అనుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. అడ్డుకోబోయిన భగవాన్‌దాస్‌ను రాడ్లతో తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.