12 గంటల్లోనే హత్యకేసు పరిష్కారం
Published Thu, Sep 26 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: హత్యచేసిన 12 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు రాజేందర్‌నగర్ పోలీసులు. నిందితులను యూపీలోని బులందర్‌కి చెందిన దీపక్‌కుమార్, బంటీకుమార్‌గా గుర్తించినట్టు సెంట్రల్ జిల్లా డీసీపీ అలోక్‌కుమార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.లక్ష 57వేల రూపాయల నగదు,రెండు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు..తన పనిమనిషి హత్య జరిగినట్టు ఓల్డ్‌రాజేందర్‌నగర్‌కి చెందిన రవిందర్‌సింగ్ అనే వ్యక్తి నుంచి మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో రాజేందర్‌నగర్ పోలీసులకు పీసీఆర్ ఫోన్ వచ్చిం ది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మొదటి అంతస్థులో ఉన్న భగవాన్ శవం కనిపించింది. ఆధారాలు సేకరించడంతోపాటు అనుమానితుల సమాచారం సేకరించారు. బంటీ,దీపక్‌కుమార్‌లు హత్యచేసి ఉంటారన్న సమాచారంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షతోనే భగవాన్‌దాస్‌ను హత్యచేసినట్టు దీపక్ ,బంటీ అంగీకరించాడు. ప్రస్తుతం భగవాన్‌దాస్ ఉద్యోగంలో దీపక్ పనిచేసేవాడు.
దీపక్ పెళ్లికోసమని ఇంటికి వెళ్లివచ్చేప్పటికే అతడి యజ మాని రవిందర్‌సింగ్ దీపక్‌ను తొలగించి భగవాన్‌దాస్‌ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న దీపక్, అదే చోట పనిచేస్తున్న బంటీతో కలిసి హత్యకు పథకం వేశాడు. యజమాని ఇంట్లోచోరీ చేసి ఆనేరాన్ని భగవాన్‌దాస్‌పై నెట్టాలని ఇద్దరూ అనుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. అడ్డుకోబోయిన భగవాన్‌దాస్‌ను రాడ్లతో తలపై గట్టిగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Advertisement