బెంగళూరు పోలీసు కమిషనర్, ఏసీపీ బదిలీ
బెంగళూరు: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ ఆందోళనలు అధికమవుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ను బదిలీ చేసింది. నగరంలో శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారనే కారణంతో ఆయనపై బదిలీ వేటు వేసింది.
ఔరాద్కర్ బదిలీకి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమోదముద్ర వేశారు. ఆయనను రాష్ట్ర రిజర్వు పోలీసు విభాగానికి అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అలాగే ఏసీపీ(శాంతిభద్రతలు) కమల్ పంత్ కూడా మానవ హక్కుల విభాగానికి బదిలీ చేశారు. ఔరాదక్కర్ స్థానంలో ఎంఎన్ రెడ్డిని నూతన కమిషనర్ గా నియమించారు. అలోక్ కుమార్ ను ఏసీపీగా నియమించింది.