mn reddy
-
బెంగళూరులో కుప్పకూలిన భారీ భవనం
-
బెంగళూరులో కుప్పకూలిన భారీ భవనం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం పెను ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్థుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సార్జాపూర్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఏడుగురిని కాపాడినట్టు రాష్ట్ర అగ్నిమాపకదళం, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్, ఎస్డీఆర్ఎఫ్ అధిపతి ఎంఎన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. శిథిలాల కింద ఇంకా కొంత మంది ఉండే అవకాశముందన్నారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భారీ భవనం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
పబ్‌లు, బార్లలో జర జాగ్రత్త..!
సాక్షి, బెంగళూరు: ముంబైలోని కమల మిల్స్ భవనంపై ఉన్న పబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంతో నగర అగ్నిమాపక శాఖ విభాగం అప్రమత్తమైంది. ముంబై ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు ముఖ్యంగా ఇటువంటి భవనాల్లో ఉన్న పబ్‌లు, బార్లు, రెస్టోరెంట్లలో తనిఖీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సంబరాలకు ఎక్కువ మంది పబ్‌లు, బార్లలలో నిర్వహించుకోవడానికి యువత ఇష్టపడుతుందన్న విషయం తెలిసిందే. అయితే నగరంలోని చాలా పబ్‌లు, బార్లు అగ్నిమాపశాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను పొందకుండానే వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. నెటిజన్లు ట్వీట్లతో సమాచారం.. ఈ నేపథ్యంలో అనేకమంది నెటిజన్లు నగరంలోని ఏఏ రెస్టారెంట్లలో ఎటువంటి పరిస్థితి ఉందన్న విషయమై రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ ఎం.ఎన్ రెడ్డికి ట్వీట్లతో సమాచారం అందించారు. ముఖ్యంగా వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రముఖ మాల్లోని రెస్టారెంట్‌తో పాటు రూఫ్ టాప్ పబ్‌లకు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు ఇందిరానగరలోని అనేక పబ్‌లు ఇళ్లకు అనుమతులు పొంది అందులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎం.ఎన్ రెడ్డికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ అధికారులు ఎం.జీరోడ్, బ్రిగేడ్‌రోడ్, ఇందిరానగర్‌లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ విషయంపై ఎం.ఎన్ రెడ్డి మాట్లాడుతూ... ‘15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలను బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణిస్తారు. ఇందులో ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కిందికి రావడానికి వీలుగా అత్యవసర మెట్లు ఉండాలి. అంతేకాక అటువంటి భవనాల ముందు అగ్నిమాపక వాహనాల నిలుపుదలకు వీలుగా విశాలమైన స్థలం ఉండాలి. ప్రతి అంతస్తులో అగ్నినిరోదక వస్తువులు తప్పక ఉండాలి. ఈ ఏర్పాట్లు లేని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. అధికారులు ప్రజలకు చెబుతున్న జాగ్రత్తలు .. ∙పబ్‌లు, బార్లలో కిచెన్‌కు దగ్గరగా సిటింగ్ టేబుల్‌పై కూర్చొకపోవడమే ఉత్తమం. ∙మద్యానికి దగ్గరగా సిగరెట్ వంటి వస్తువులు ఉండకుండా చూడాలి. ∙పబ్‌కు, రెస్టారెంట్‌కు వెళ్లే సమయంలోనే అత్యవసర ద్వారాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ∙అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్‌ను ఉపయోగించకపోవడమే మేలు -
యువకుడి అదృశ్యంపై కేసు
పెనుకొండ రూరల్ : మరువపల్లికి చేందిన జీసీ.పవన్‌కుమార్(20) కనిపించడం లేదని అతడి తండ్రి గొల్ల రాము బుధవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగన్న తెలిపారు. -
కర్ణాటక డీజీపీ రేస్‌లో గుత్తి వాసి
గుత్తి రూరల్ : కర్ణాటక రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) రేసులో గుత్తికి చెందిన మలగవేలి నారాయణరెడ్డి (ఎంఎన్‌రెడ్డి) ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర కమాండెంట్ జనరల్, హోమ్గార్డ్స్, సివిల్ డిఫెన్స్, ఫైర్ ఎమర్జెన్సీ (ఎస్డీఆర్ఎఫ్) డైరెక్టర్‌గా ఉన్నారు. గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డుకు చెందిన దివంగత ఎం.రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు ఎంఎన్‌రెడ్డి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ గుత్తి ఏడో వార్డులోని ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి పది వరకు గుత్తి ఎంఎస్ హైస్కూల్లో, ఇంటర్మీడియట్ కర్నూలు, డిగ్రీ హైదరాబాదులో చదివారు. 1984 కర్ణాటక రాష్ట్ర బ్యాచ్‌కు ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. తొలి పోస్టింగ్ అదే రాష్ట్రంలోని మైసూర్లో అడిషనల్ ఎస్పీగా లభించింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి పంపిన డీజీపీ ఎంపిక జాబితాలో ఎంఎన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ రాష్ట్రానికే చెందిన మహిళా ఐపీఎస్ నీలమణి రాజుతో ఆయన డీజీపీ పోస్టు కోసం పోటీపడుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఫిబ్రవరి ఒకటి నుంచి కర్ణాటక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కర్ణాటక రాష్ట్ర డీజీపీ రేసులో ‘అనంత’ వాసి ఉండడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కమిషనర్‌పై బదిలీ వేటు ?
సాక్షి, బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారి డి.కె.రవి గత సోమవారం కోరమంగళలోని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో డి.కె.రవి నివాసానికి చేరుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి ఆ వెంటనే అక్కడి విలేకరులతో మాట్లాడుతూ...‘ఘటనా స్థలంలో లభించిన కొన్ని ఆధారాలను బట్టి డి.కె.రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది’ అని ప్రకటించేశారు. దీంతో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ కేసులో అసలేమీ దర్యాప్తు జరగకుండానే డి.కె.రవి ఆత్మహత్యకు పాల్పడ్డారని నగర పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి ప్రకటన చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు డి.కె.రవి తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును పక్కదారి పట్టించేందుకే సంఘటన జరిగిన కాసేపటికే డి.కె.రవి మృతిని ఆత్మహత్యగా చిత్రిస్తూ కమిషనర్‌తో ప్రకటన చేయించారని విపక్షాలు సైతం విమర్శించాయి. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. కమిషనర్ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఓ కేసులో ఇలాంటి బాధ్యతా రహిత వ్యాఖ్యలను ఎలా చేశారంటూ విపక్షాలు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిని సమర్థించేందుకు స్వయానా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రయత్నించినా విపక్షాలను ఒప్పించ లేకపోయారు. ఇక గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో సైతం అనేక మంది మంత్రులు సైతం ఎం.ఎన్.రెడ్డిని బదిలీ చేయాల్సిందేనని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఇక హోం శాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమవుతుండడంతో పాటు డి.కె.రవి మృతి కేసులో ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్న కె.జె.జార్జ్‌ను సైతం హోం శాఖ బాధ్యతల నుంచి తప్పించి వేరే ఏదైనా అప్రాధాన్య శాఖను కట్టబెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్‌ను ఇప్పుడే ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పిస్తే విపక్షాలకు విమర్శలు చేసేందుకు మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్న సిద్ధరామయ్య జార్జ్ శాఖ మార్పునకు సంబంధించి మరికొంత కాలం వేచి చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆ ముగ్గురూ బాంబులు తయారుచేసేవారే!
బెంగళూరు: ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు బాంబులు తయారు చేసేవారని నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వారు తయారు చేసిన బాంబులను వివిధ ఉగ్రవాద సంస్థలకు సరఫరా చేసే వారని కూడా ఆయన తెలిపారు. వారికి హవాలా ధనం అందుతుందన్న అనుమానాలున్నాయన్నారు. నగరంలోని పులకేశినగరతో పాటు భట్కళ్‌లో ఉగ్రవాద ఆరోపణలపై సయ్యద్ ఇస్మయిల్ అఫక్, సబూర్, సద్దాం హుసేన్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని కోర్టుకు హాజరుపరచగా ఈనెల 21వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది పోలీసుల విచారణలో వారు పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం .. హైదరాబాద్‌లో 2013 ఫిబ్రవరిలో జరిగిన బాంబుపేలుళ్లు, పూనెలోని జర్మన్బేకరి పేలుళ్ల వెనుక ఈ ముగ్గురి హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సోదాల్లో వీరి వద్ద దొరికిన వస్తువులు, పేలుళ్ల సమయంలో అక్కడ దొరికొని వస్తులవులతో పోల్చి చూసిన పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు. బాంబుల తయారీ, రవాణాలో అఫక్ ఆదేశాలను అనుసరించి మిగిలిన ఇద్దరూ పనిచేసేవారని తెలుస్తోంది. అఫక్ బాంబుల తయారీకి సంబంధించి పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ(కేఎఫ్‌డీ) సంస్థ తరఫున పనిచేస్తున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరు ముగ్గురూ బాంబుల తయారీ, వాటిని రిమోట్ ద్వారా పేల్చడంలో నిష్ణాతులని తెలుస్తోంది. సయ్యద్ ఇస్మాయిల్ అఫక్ భార్య పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈమెను కలవడానికే అఫక్ పాకిస్థాన్ వెళ్లేవాడని, అదే సందర్భంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం అతను బెంగళూరు చేరుకొని ఇంజనీర్లు, విద్యార్థులు, వైద్యులను తన సంస్థ(కేఎఫ్‌డీ)లో చేర్చుకునేందుకు పావులు కదిపాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
బెంగళూరు పోలీసు కమిషనర్, ఏసీపీ బదిలీ
బెంగళూరు: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ ఆందోళనలు అధికమవుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ను బదిలీ చేసింది. నగరంలో శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారనే కారణంతో ఆయనపై బదిలీ వేటు వేసింది. ఔరాద్కర్ బదిలీకి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమోదముద్ర వేశారు. ఆయనను రాష్ట్ర రిజర్వు పోలీసు విభాగానికి అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అలాగే ఏసీపీ(శాంతిభద్రతలు) కమల్ పంత్ కూడా మానవ హక్కుల విభాగానికి బదిలీ చేశారు. ఔరాదక్కర్ స్థానంలో ఎంఎన్ రెడ్డిని నూతన కమిషనర్ గా నియమించారు. అలోక్ కుమార్ ను ఏసీపీగా నియమించింది.