Raghavendra auradkar
-
బెంగళూరు పోలీసు కమిషనర్, ఏసీపీ బదిలీ
బెంగళూరు: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన నేపథ్యంలో పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ ఆందోళనలు అధికమవుతుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ను బదిలీ చేసింది. నగరంలో శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారనే కారణంతో ఆయనపై బదిలీ వేటు వేసింది. ఔరాద్కర్ బదిలీకి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆమోదముద్ర వేశారు. ఆయనను రాష్ట్ర రిజర్వు పోలీసు విభాగానికి అదనపు డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అలాగే ఏసీపీ(శాంతిభద్రతలు) కమల్ పంత్ కూడా మానవ హక్కుల విభాగానికి బదిలీ చేశారు. ఔరాదక్కర్ స్థానంలో ఎంఎన్ రెడ్డిని నూతన కమిషనర్ గా నియమించారు. అలోక్ కుమార్ ను ఏసీపీగా నియమించింది. -
బాస్‌పై వేటు?
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఔరాద్కర్ బదిలీకి రంగం సిద్ధం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన సొంత పార్టీ నేతలు రేసులో సీనియర్ ఐపీఎస్‌లు సునీల్‌కుమార్‌కు అవకాశం కల్పించే యోచన ఔరాద్కర్ పనితీరుపై ప్రభుత్వం సీరియస్ బెంగళూరు : బెంగళూరు నగర పోలీస్ బాస్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను బదిలీకి రంగం సిద్ధమైంది. నిత్యం వివాదాలతో పాటు శాంతి భద్రతలు లోపిస్తున్నాయంటూ ఔరాద్కర్ పనితీరుపై అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆయనను బదిలీ చేసి సమర్థుడైన మరో అధికారిని నగర పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ఔరాద్కర్ బదిలీ అనివార్యమనే నిర్ణయానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఔరాద్కర్ పనితీరుపై ప్రభుత్వం సీరియస్ కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఏటీఏం కేంద్రంలో కొడవలితో దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకూ పట్టుకోలేకపోవడం, లంచం తీసుకున్న ఇన్స్పెక్టర్ రాజేష్‌ను అరెస్ట్ చేయకపోవడం, ఏడీజీపీ రవీంద్రనాథ్‌తో అనుచిత ప్రవర్తన, యూబీ సిటీలోని బార్లో ఎమ్మెల్యే విజయానంద కాశ్యపనవర్ కేసు దర్యాప్తు సహా పలు కేసుల్లో నగర సీపీ ఔరాద్కర్ ఉదాసీనంగా వ్యవహరించాడన్న బాస్‌పై వేటు? ఆరోపణలున్నాయి. కాఫీ షాప్‌లో ఏడీజీపీ రవీంద్రనాథ్ ఫొటోలు తీసిన కేసుకు సంబంధించి కేసు దర్యాప్తును నిర్వీర్యం చేశాడన్న ఆరోపణలు సైతం ఔరాద్కర్‌పై ఉన్నాయి. ఇదే విషయాన్ని కేసు దర్యాప్తు పూర్తి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సీఐడీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఔరాద్కర్‌పై గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఆయన స్థానంలో మరో సీనియర్ అధికారిని నియమించాలని భావిస్తోంది. పోటీలో పలువురు సీనియర్లు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీట్లో కూర్చొనేందుకు పలువురు సీనియర్ ఐపీఎస్‌లు పోటీ పడుతున్నారు. ఔరాద్కర్ కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న తొమ్మిది మంది అధికారులు ముందు వరసలో ఉన్నారు. వారిలో నీలమణి ఎస్.రాజు( కేంద్ర ప్రభుత్వ సర్వీసు), తర్వాత స్థానాల్లో కిషోర్ చంద్ర, ఎం.ఎన్.రెడ్డి, ప్రేమశంకర్, మీనా సత్యనారాయణ, ఎ.ఎం.ప్రసాద్, ప్రవీణ్‌సూద్, పి.కె.గార్గ్, గగన్‌దీప్ ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో వరుసగా అలోక్ మోహన్, మేఘరికర్, ఆర్.పి.శర్మ, పి.రవీంద్రనాథ్, సంజయ్ సహాయ్, సునీల్‌కుమార్ ఉన్నారు. హెచ్.డి.కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిశోర్‌చంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆయన పనిచేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయనను బెంగళూరు సీపీగా నియమించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడు, విశ్రాంత ఏడీజీపీ కెంపయ్య సూచన మేరకు అలోక్మోహన్ను ఆ స్థానంలో నియమించే అవకాశలు ఉన్నట్లు వదంతులూ వ్యాపించాయి. అయితే పోలీస్ శాఖలోనే అలోక్ మోహన్‌కు వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో ఆయన నియామకంపై ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్న వాదనలు లేకపోలేదు. సునీల్‌కుమార్‌కు సీపీ చాన్స్? బెంగళూరు నగర శాంతి భద్రతల విభాగంలో జాయింట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి, మంచి పేరు తెచ్చుకుఏన్న తూకివాకం సునీల్‌కుమార్‌ను బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజాయితీ గల అధికారిగా, వివాదరహితుడిగా సునీల్‌కుమార్‌కు పేరుంది. మదానీకి నెల రోజుల బెయిల్ సాక్షి, బెంగళూరు : ఉగ్రవాద ప్రోత్సాహక ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్ నాసీర్ మదానీకి షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం మంజూరు చేసింది. బెంగళూరులో 2008లో జరిగిన బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మదానీ నాలుగేళ్లుగా ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎ.కె.సిక్రీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నుంచి నెల రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అదే సమయంలో మదానీ దినచర్యపై నిఘా పెంచాలని పోలీసులకు సూచించింది. -
మేనమామ కిరాతకం
డబ్బు కోసం అక్క కుమార్తె కిడ్నాప్ రక్త సంబంధాన్ని మరచి ఉసురు తీసిన దుర్మార్గుడు సహకరించిన భార్య నిందితుల అరెస్ట్ బెంగళూరు : ప్రేమాను రాగాలు, రక్త సంబంధాలు మరచిన సొంత మేనమామ డబ్బు కోసం ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన సంఘటన నగరంలో సం చలనం సృష్టించింది. భారతీనగర తిమ్మయ్య రోడ్డులో నివాసం ఉంటున్న సల్మాన్ (28) అతని భార్య షబ్రీన్ (25)ను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నిందితుడు సల్మాన్ తన అక్క చివరి కుమార్తె రితిభ నిస్సార్ (7)ను గొంతు నులిమి హత్య చేశాడు. వివరాలు... సల్మాన్ అక్క భర్త నిషార్ సివిల్ ఇంజినీరు. పదేళ్లుగా దుబాయ్‌లో ఉంటూ భారీగానే ఆస్తులు కూడా బెట్టాడు. నిస్సార్ దంపతులకు నలుగురు పిల్లలు. చివరి అమ్మాయి రితిభ ఇక్కడి అశోక్‌నగరలోని ధనరాజ్ పూల్‌చంద్ హిందీ స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే సల్మాన్ అక్వేరియం చేపలు విక్రయించే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బావ దగ్గర ఉన్న డబ్బుపై వ్యామోహం పెంచుకున్న సల్మాన్ ఎలాగైనా అతని వద్ద నుంచి డబ్బు రాబట్టలాని భావిం చాడు. దీని కి భార్య సైతం సహకరిస్తానని చెప్పడంతో చిన్నారి రితిభను కిడ్నాప్ చేసి నగదు డిమాండ్ చేయాలని సల్మాన్ ప్లాన్ వేశాడు. వారం రోజులుగా నిస్సార్ కుటుం బంపై నిఘా పెట్టారు. బుధవారం మధ్యాహ్నం రితిభ చదువుతున్న పాఠశాలకు వెళ్లిన సల్మాన్ భార్య షబ్రీన్, తాను రితిభ పిన్నమ్మగా పరిచయం చేసుకుని రితిభ అవ్వ ఛాతీనొప్పితో ఆస్పత్రిలో చేరిందని బాలికను పం పించాలని కోరింది. అదే పాఠశాలలో చదువుతున్న రితి భ అక్క రంజాన్ దీక్షలో ఉండటంతో ఆమెకు విషయం చెప్పలేదని టీచర్‌ను నమ్మించింది. అనంతరం బాలికను తీసుకుని అక్కడి నుంచి మాయమైంది. అప్పటి నుంచి సల్మాన్ తనఅక్క సెల్‌కు రూ. 10 లక్షలు ఇస్తే బాలికను వదిలి పెడతానని ఎస్ఎంఎస్ వేయడం మొదలు పెట్టా డు. అయితే ఇదేమి పట్టించుకోని ఆమె మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లగా కుమార్తెను ఓ యువతి తీసుకెళ్లిందని చెప్పడంతో కంగుతింది. బుర్కా ధరించిన మహిళ వచ్చి తీసుకెళ్లిందని పాఠశాల సిబ్బంది చెప్పడంతో వారు అశోక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సల్మాన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఏమీ తెలియని అమాయకుడిలా నటించాడు. అతని వ్యవహార శైలిని అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. అప్పటికే కిరాతకుడు బాలికను గొంతునులిమి చంపి భారతినగరలోని ఇంటిలో దాచాడు. తమను గుర్తు పడుతుందని రితిభను హత్య చేశామని సల్మా న్, షబ్రీన్ పోలీసుల ఎదుట అంగీకరించారు. పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మొబైళ్లు ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఔరాద్కర్ చెప్పారు. పిల్లలు లేని వీరు రితిభను ఎంతో అప్యాయంగా చూసుకునేవారని, దత్తతు ఇవ్వాలని కోరేవాడని తమ విచారణలో తేలిందని కమిషనర్ తెలిపారు. డీసీపీ రవికాంత్‌గౌడ నేతృత్వంలో ఏసీపీలు సిద్ధరామయ్య, శోభారాణి ఆధ్వర్యంలోని బృందం నిందితులను అరెస్ట్ చేశారు. -
ఏటీఎంలకు భద్రతపై నేటితో గడువు పూర్తి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని ప్రభుత్వం విధించిన గడువు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది. తదుపరి... గార్డులు లేని ఏటీఎం కేంద్రాలను మూసి వేయిస్తామని నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ఇదివరకే హెచ్చరించారు. దీంతో బ్యాంకులు యుద్ధప్రాతిపదికన గార్డులను నియమించే పనిలో పడ్డాయి. నగరంలో రెండు వేల ఏటీఎంలుంటే, ఆరు వందల కేంద్రాల్లో గార్డులు లేరు. కొన్ని బ్యాంకులు తమ ఏటీఎం కేంద్రాల వద్ద రాత్రి పూట మాత్రమే గార్డులను నియమిస్తున్నాయి. ఇక మీదట అలా కాకుండా 24 గంటలూ కాపలా పెట్టాల్సి ఉంది. గత మంగళవారం ఉదయం ఇక్కడి బీబీఎంపీ కార్యాలయం సర్కిల్లోని కార్పొరేషన్ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో అదే బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఓ ఆగంతకుడు వేట కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇక్కడి కెంగేరిలోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోజు రోజుకు ఆమె పరిస్థితి మెరుగు పడుతోందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో వైపు ఆగంతకుని కోసం అధికారులు సహా 200 మందికి పైగా సిబ్బంది గాలిస్తున్నారు. ఐదు రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. మధ్యలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలి వేస్తున్నారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అనంతపురం, హిందూపురం పరిసరాల్లోనే పోలీసుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. హిందూపురంలోని పలు సర్కిళ్లలో ఆగంతకుని ఫొటో, బహుమతి వివరాలతో కూడిన పోస్టర్లను అంటించారు. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్, కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో కూడా ఇలాంటి పోస్టర్లు వెలిశాయి. ఆంధ్ర సరిహద్దులోని చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరు, తుమకూరు జిల్లా మధుగిరిల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారడంతో పాటు... ‘ ప్చ్, ఇన్నాళ్లయినా ఆ దుండగుని పట్టుకోలేదా..’ అనే పెదవి విరుపులు వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆగంతకుని చుట్టు ముట్టామని, ఏ క్షణంలోనైనా పట్టుకుంటామని పోలీసు అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి మొబైల్ ఫోన్‌ను హిందూపురంలో విక్రయించినందున, ఆగంతకుడు చుట్టు పక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మోడీ సభకు మూడు వేల మందితో బందోబస్తు
= మోడీ సభకు మూడు వేల మందితో బందోబస్తు = రంగంలో గుజరాత్ పోలీసులు = ‘పాట్నా’ సంఘటన దృష్ట్యా భద్రత పెంపు = పలు చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు = సభా స్థలి పరిసరాల్లో రేపు మద్యం దుకాణాల మూసివేత = నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీహార్‌లో ఎదురైన సంఘటన దృష్ట్యా ఇక్కడి ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరిగే బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన సభా స్థలిని సందర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పది మంది డీసీపీలు, 25 మంది ఏసీపీలు, వంద మంది ఇన్స్పెక్టర్లు, 300 మంది ఏఎస్ఐలు, మూడు వేల మంది పోలీసులు, 800 మంది హోమ్ గార్డులు, ఐదు వందల మంది పౌర రక్షణ సిబ్బందిని బహిరంగ సభ వద్ద మోహరించనున్నట్లు వివరించారు. బహిరంగ సభకు ముందు మోడీ రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. హెలికాప్టర్లోనే అన్ని కార్యక్రమాలకు హాజరవుతారని చెప్పారు. బీహార్ సంఘటన దృష్ట్యా ప్రత్యేక భద్రతను కల్పించాలన్న కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. ఆయన వచ్చి, తిరిగి వెళ్లేంత వరకు నగర వ్యాప్తంగా పటిష్టమైన బందోబస్తు ఉంటుందని తెలిపారు. బస్సు స్టేషన్లు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మాల్స్ వద్ద సిబ్బందిని మోహరించనున్నట్లు చెప్పారు. గుజరాత్ పోలీసులు కూడా వస్తున్నారని, తమ సిబ్బంది వారితో ఉంటుందని తెలిపారు. వీరికి తోడు 1,400 మంది బీజేపీ స్వయం సేవకుల సహకారాన్ని కూడా తీసుకోదలచామని చెప్పారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతిస్తామని తెలిపారు. పదకొండు గంటలకు ప్రారంభయ్యే సభకు తొమ్మిది గంటల నుంచే ప్రవేశానికి అవకాశం కల్పిస్తామన్నారు. మొబైల్ ఫోన్లను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. జేసీ నగర, యశవంతపుర పోలీసుల స్టేషన్ల పరిధిలో ఆదివారం మద్యం విక్రయాలను నిషేధించనున్నట్లు ఆయన వెల్లడించారు.