ఆంధ్ర పరాజయం | Andhra beaten | Sakshi
Sakshi News home page

ఆంధ్ర పరాజయం

Published Mon, Jan 30 2017 1:28 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

Andhra beaten

చెన్నై: ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో ఆంధ్ర జట్టుకు కేరళ చేతిలో పరాజయం ఎదురైంది. ఆదివారం చెపాక్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ 21 పరుగుల తేడాతో గెలిచింది. మొదట కేరళ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విష్ణు వినోద్‌ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో అయ్యప్ప, శశికాంత్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేయగల్గింది.

రికీ భుయ్‌ (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్‌), రవితేజ (33) మెరుగ్గా ఆడారు. కేరళ బౌలర్లలో బాసిల్‌ 3, సందీప్, వినోద్‌ చెరో 2 వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌ 51 పరుగుల తేడాతో గోవాపై ఘనవిజయం సాధించింది. హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగుల భారీస్కోరు చేయగా... గోవా 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓడింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement