Mushtaq Ali T20 tournament
-
6 బంతుల్లో 5 వికెట్లతో చెలరేగిపోయాడు..
గతంలో ఒకసారి... బంగ్లాదేశ్ దేశవాళీ టోర్నీ విక్టరీ డే టి20 కప్ మ్యాచ్ (26డిసెంబర్, 2013)లో అల్ అమీన్ హుస్సేన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. అబహాని లిమిటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్ అమీన్ యూసీబీ–బీసీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అబహాని ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 5 వికెట్లు తీశాడు. తొలి బంతికి మెహదీ మారూఫ్ అవుట్ కాగా... చివరి నాలుగు బంతులకు నజ్ముల్ హుస్సేన్, సొహ్రవర్ది ష్రువో, నయీమ్ ఇస్లామ్, నబీల్ సమద్‌లను అమీన్ అవుట్ చేశాడు. ఈ ఐదు కూడా క్యాచ్‌లే. సూరత్: వికెట్, వికెట్, వికెట్, వికెట్, వైడ్, 1, వికెట్... ఒకే ఓవర్లో కర్ణాటక పేస్ బౌలర్ అభిమన్యు మిథున్ ప్రదర్శన ఇది. దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. హరియాణాతో జరిగిన ఈ మ్యాచ్ చివరి ఓవర్లో చెలరేగిన మిథున్ ‘హ్యాట్రిక్’ సహా ఏకంగా 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ ఐదు వికెట్లూ ఫీల్డర్ల క్యాచ్‌ల ద్వారానే వచ్చాయి. తొలి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసిన అతను తర్వాతి బంతిని వైడ్‌గా విసిరాడు. అనంతరం సింగిల్ ఇచ్చిన అతను చివరి బంతికి కూడా మరో వికెట్ పడగొట్టాడు. టి20 చరిత్రలో ఈ తరహా ఫీట్ రెండో సారి నమోదు కావడం విశేషం. భారత్ నుంచి ఇదే మొదటి సారి కాగా 2013లో బంగ్లాదేశ్ పేసర్ అల్ అమీన్ హుస్సేన్ ఇలాగే టి20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 5 వికెట్లు తీశాడు. ఫైనల్లో కర్ణాటక... బౌలింగ్‌లో మిథున్ ప్రదర్శనకు తోడు బ్యాటింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (42 బంతుల్లో 87; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాటింగ్‌లో చెలరేగడంతో హరియాణాను చిత్తు చేసి కర్ణాటక ఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హరియాణా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హిమాన్షు రాణా (34 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చైతన్య బిష్ణోయి (35 బంతుల్లో 55; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా, హర్షల్ పటేల్ (20 బంతుల్లో 34; 6 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తేవటియా (20 బంతుల్లో 32; 6 ఫోర్లు) రాణించారు. 19వ ఓవర్ ముగిసేసరికి 3 వికెట్లకు 192 పరుగులతో ఉన్న హర్యానా ఆఖరి ఓవర్లో మిథున్ దెబ్బకు 2 పరుగులే చేయగలిగింది. అనంతరం కర్ణాటక 15 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. రాహుల్, దేవ్‌దత్ తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 125 పరుగులు జోడించగా... మయాంక్ అగర్వాల్ (14 బంతుల్లో 30 నాటౌట్; 3 సిక్సర్లు) మిగతా పనిని పూర్తి చేశాడు. తుది పోరుకు తమిళనాడు... మరో మ్యాచ్‌లో రాజస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి తమిళనాడు ఫైనల్లోకి ప్రవేశించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులే చేయగలిగింది. రాజేశ్ బిష్ణోయి (23), రవి బిష్ణోయి (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. అనంతరం తమిళనాడు 17.5 ఓవర్లలో 3 వికెట్లకు 116 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (46 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, రవిచంద్రన్ అశ్విన్ (33 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ఆదివారం కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తుది పోరులో కూడా ఈ రెండు జట్లే తలపడ్డాయి. మిథున్ హ్యాట్రిక్‌ల జాబితా రంజీ ట్రోఫీ (ఫస్ట్‌క్లాస్): కర్ణాటక x ఉత్తర ప్రదేశ్ (నవంబర్ 3–6, 2009): పీయూష్‌చావ్లా, ఆమిర్ ఖాన్, ఆర్పీ సింగ్. విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్–ఎ): కర్ణాటక x తమిళనాడు (అక్టోబర్ 25, 2019): షారుఖ్ ఖాన్, ఎం.మొహమ్మద్, ఎం. అశ్విన్ ముస్తాక్ అలీ టోర్నీ (టి20): కర్ణాటక x హరియాణా (నవంబర్ 29, 2019): హిమాన్షు రాణా, రాహుల్ తేవటియా, సుమీత్ కుమార్ (హ్యాట్రిక్), అమిత్ మిశ్రా (నాలుగో బంతి), జయంత్ యాదవ్ (ఆరోబంతి) మూడు ఫార్మాట్లలోనూ... దేశవాళీలో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చి అదే జోరును కొనసాగించలేక కనుమరుగైపోయిన పేస్ బౌలర్లలో 30 ఏళ్ల అభిమన్యు మిథున్ కూడా ఒకడు. 2010 జులై నుంచి 2011 డిసెంబర్ మధ్య మిథున్ భారత్ తరఫున 4 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 50.66 సగటుతో 9 వికెట్లు, వన్డేల్లో 67.66 సగటుతో 3 వికెట్లు మాత్రమే తీయడంతో అతను సెలక్టర్ల విశ్వాసం కోల్పోయాడు. అయితే ఇప్పటికీ కర్ణాటక జట్టు కీలక ఆటగాళ్లలో అతను కొనసాగుతున్నాడు. తాజా ప్రదర్శనతో అతను భారత దేశవాళీ క్రికెట్‌కు సంబంధించిన మూడు ఫార్మాట్లలోనూ హ్యాట్రిక్ తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. 2009లో తన తొలి రంజీ మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన మిథున్... గత నెలలో తన పుట్టిన రోజున విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడుపై హ్యాట్రిక్ తీశాడు. -
ఆంధ్రకు మరో ఓటమి
చెన్నై: ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి ఎదురైంది. గురువారం ఆంధ్రతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 37 పరుగుల తేడాతో ఆంధ్రపై గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (49 బంతుల్లో 69; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... సతీశ్ (32 నాటౌట్) ధాటిగా ఆడాడు. అనంతరం హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రికీ భుయ్ (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించినా జట్టుకు ఓటమి తప్పలేదు. హనుమ విహారి (37) రాణించాడు. -
ఆంధ్ర పరాజయం
చెన్నై: ముస్తాక్ అలీ టి20 టోర్నీలో ఆంధ్ర జట్టుకు కేరళ చేతిలో పరాజయం ఎదురైంది. ఆదివారం చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ 21 పరుగుల తేడాతో గెలిచింది. మొదట కేరళ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విష్ణు వినోద్ (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆంధ్ర బౌలర్లలో అయ్యప్ప, శశికాంత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులే చేయగల్గింది. రికీ భుయ్ (36 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (33) మెరుగ్గా ఆడారు. కేరళ బౌలర్లలో బాసిల్ 3, సందీప్, వినోద్ చెరో 2 వికెట్లు తీశారు. మరో మ్యాచ్‌లో హైదరాబాద్ 51 పరుగుల తేడాతో గోవాపై ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగుల భారీస్కోరు చేయగా... గోవా 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి ఓడింది. -
ఫైనల్లో బరోడా, యూపీ
ముంబై: ముస్తాక్ అలీ టి20 టోర్నీ ఫైనల్లో బరోడా, ఉత్తర ప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. సూపర్ లీగ్ గ్రూప్ ‘ఎ’లో బరోడా అగ్రస్థానంలో నిలవగా... గ్రూప్ ‘బి’ నుంచి యూపీ టాప్‌లో నిలిచింది. గ్రూప్ ‘ఎ’లో బ రోడాతో పాటు కేరళ, ముంబై కూడా ఎనిమిది పాయింట్లు సాధించినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా బరోడా ముందుకెళ్లింది. గ్రూప్ ‘బి’లో యూ పీ 12 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఫైనల్ బుధవారం జరుగుతుంది. సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బరోడా ముంబైపై వికెట్ తేడాతో గెలిచింది. ముందుగా ముంబై 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 151 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 57 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఫైనల్‌కు చేరాలంటే బరోడా 19.1 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ జట్టు 19 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. దీపక్ హుడా (35 బంతుల్లో 53; 5 ఫోర్లు; 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. మరో మ్యాచ్‌లో యూపీ జట్టు మూడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 158 పరుగులు చేసింది. ఉన్ముక్త్ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు; 3 సిక్సర్లు), పవన్ నేగి (23 బంతుల్లో 41; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు. యూపీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 159 పరుగులు చేసింది. ద్వివేది (35 బంతుల్లో 49; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 2 వికెట్ల తేడాతో విదర్భపై, గుజరాత్ 6 వికెట్లతో జార్ఖండ్‌పై నెగ్గాయి. -
నాకౌట్‌కు బరోడా, ఢిల్లీ
► ఆంధ్రకు మరో ఓటమి ► ముస్తాక్ అలీ టి20 టోర్నీ వడోదర: సయ్యద్ ముస్తాక్ అలీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో గ్రూప్ ‘సి’ నుంచి బరోడా, ఢిల్లీ జట్లు నాకౌట్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. లీగ్‌లో ఐదేసి మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లూ అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి 20 పాయింట్ల చొప్పున సాధించాయి. శనివారం జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు ఆంధ్రపై మూడు వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ భరత్ (30) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. బౌలర్ అయ్యప్ప (24) చివర్లో పోరాడటంతో ఆంధ్రకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. బరోడా బౌలర్లలో పాండ్య, ఆరోధ్, భట్ రెండేసి వికెట్లు తీశారు. బరోడా జట్టు 16.5 ఓవర్లలో ఏడు వికెట్లకు 93 పరుగులు చేసి నెగ్గింది. 72 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయినా ఇర్ఫాన్ పఠాన్ (28 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. మరో మ్యాచ్‌లో ఢిల్లీ 2 పరుగులతో గోవాపై గెలిచింది. తొలుత ఢిల్లీ 91 పరుగులకు ఆలౌట్ కాగా... గోవా 20 ఓవర్లలో 9 వికెట్లకు 89 పరుగులు మాత్రమే చేసింది. ఇదే టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి కేరళ 20 పాయింట్లతో నాకౌట్ స్థానాన్ని ఖరారు చేసుకోగా... జార్ఖండ్ 16 పాయింట్లతో ఉంది. సౌరాష్ట్ర, పంజాబ్ 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ మూడింటిలో ఒక జట్టు కేరళతో పాటు నాకౌట్‌కు చేరుతుంది. అందరికీ ఒక్కో మ్యాచ్ మిగిలుంది. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ 16 పాయింట్లతో దాదాపుగా నాకౌట్ బెర్త్ సాధించింది. తమిళనాడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ 12 పాయింట్లతో ఉన్నాయి. అన్ని జట్లకూ ఒక్కో మ్యాచ్ మిగిలుంది. -
2 పరుగులు.. 2 వికెట్లు
ఇర్ఫాన్ పఠాన్ 5/13 * హైదరాబాద్, ఆంధ్ర పరాజయం * పాండే, చావ్లా హ్యాట్రిక్... * ముస్తాక్ అలీ టి20 టోర్నీ కొచ్చి: జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికైన తర్వాత ఆడిన తొలి టి20 మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌లో నిరాశపర్చాడు. ముస్తాక్ అలీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ 5 బంతుల్లో 2 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినా అప్పటికే పంజాబ్ జట్టు పరాజయం ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మన్దీప్ సింగ్ (52 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్ 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 6 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాజేశ్ బిష్ణోయ్ (32 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలిపించాడు. వడోదర: ఈశ్వర్ పాండే (4/20) హ్యాట్రిక్ సహాయంతో మధ్యప్రదేశ్ 5 వికెట్లతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్. శ్రీనివాస్ (22)దే అత్యధిక స్కోరు. మ్యాచ్ నాలుగో ఓవర్లో పాండే వరుస బంతుల్లో భరత్, ప్రశాంత్, ప్రదీప్‌లను అవుట్ చేయడం విశేషం. అనంతరం ఎంపీ 5 వికెట్లకు 96 పరుగులు చేసింది. కటక్: ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. కేదార్ జాదవ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మహారాష్ట్ర 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. యూపీ బౌలర్ పీయూష్ చావ్లా (4/28) హ్యాట్రిక్ సాధించడం విశేషం. అనంతరం యూపీ 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. షమీకి 3 వికెట్లు... నాగపూర్: వృద్ధిమాన్ సాహా (47 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సాయన్ మోండల్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో బెంగాల్ 61 పరుగులతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. ముందుగా బెంగాల్ 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ 16.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. అక్షత్ రెడ్డి (32) మినహా అంతా విఫలమయ్యారు. మొహమ్మద్ షమీ (3/18) రాణించాడు. వడోదర: దీపక్ హుడా (48 నాటౌట్), కేదార్ దేవధర్ (48) రాణించడంతో బరోడా 49 పరుగులతో అస్సాంను ఓడించింది. బరోడా 8 వికెట్లకు 165 పరుగులు చేయగా...అస్సాం 116 పరుగులకే కుప్పకూలింది. ఇర్ఫాన్ పఠాన్ 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక్కడే జరిగిన మరో మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్లతో రైల్వేస్‌ను ఓడించింది. ముందుగా రైల్వేస్ 2 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌరభ్ వకాస్కర్ (55 బంతుల్లో 118; 7 ఫోర్లు, 11 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్‌తో సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ ఈ భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఆదిత్య కౌశిక్ (53), ఉన్ముక్త్ (38), నేగి (35 నాటౌట్), రాణా (34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.