ఆంధ్రకు మరో ఓటమి | AP to another defeat | Sakshi
Sakshi News home page

ఆంధ్రకు మరో ఓటమి

Published Fri, Feb 3 2017 12:51 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM

AP to another defeat

చెన్నై: ముస్తాక్‌ అలీ టి20 టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు మరో ఓటమి ఎదురైంది.  గురువారం ఆంధ్రతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 37 పరుగుల తేడాతో ఆంధ్రపై గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తమిళనాడు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.

విజయ్‌ శంకర్‌ (49 బంతుల్లో 69; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేయగా... సతీశ్‌ (32 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. అనంతరం హైదరాబాద్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రికీ భుయ్‌ (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించినా జట్టుకు ఓటమి తప్పలేదు. హనుమ విహారి (37) రాణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement