ఆంధ్ర, తెలంగాణ జట్ల విజయం | ap and telangana win at sepak takraw | Sakshi
Sakshi News home page

ఆంధ్ర, తెలంగాణ జట్ల విజయం

Published Sat, Jul 30 2016 2:15 PM | Last Updated on Sat, Aug 18 2018 9:18 PM

ఆంధ్ర, తెలంగాణ జట్ల విజయం - Sakshi

ఆంధ్ర, తెలంగాణ జట్ల విజయం

సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో రెగూ ఈవెంట్ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జట్లు రెండేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఆంధ్రప్రదేశ్ 21-11, 21-18తో బీహార్‌పై, 21-7, 21-16తో అస్సాంపై గెలుపొందగా... తెలంగాణ జట్టు 21-10, 21-9తో చండీగఢ్‌ను, 21-12, 19-21, 21-14తో పశ్చిమ బెంగాల్‌ను ఓడించింది.

బాలికల విభాగంలో మాత్రం తెలంగాణ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ 16-21, 22-20, 13-21తో బీహార్ చేతిలో, అనంతరం 13-21, 19-21తో ఢిల్లీ చేతిలో ఓడిపోయాయి. ఇతర మ్యాచ్‌ల్లో ఒడిశా 21-6, 21-11తో ఉత్తరప్రదేశ్‌పై, కర్ణాటక 21-14, 21-19తో పంజాబ్‌పై, తమిళనాడు 21-1, 21-5తో హరియాణాపై విజయం సాధించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement