బలంగా ముఖంపై తన్నినందుకు..
బ్యూనస్ ఎయిర్స్: ఓ అర్జెంటీనా రగ్బీ ప్లేయర్పై భారీ స్థాయిలో వేటు పడింది. దాదాపు 29 ఏళ్లపాటు అతడిని ఆ క్రీడ నుంచి సస్పెండ్ చేస్తూ బ్యూనస్ ఎయిర్స్ రగ్బీ యూనియన్(యూఆర్బీఏ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3న పుకారా, సాన్ అల్బానో జట్ల మధ్య జరిగిన రగ్బీ క్రీడలో అతడు మరో వ్యక్తిని తీవ్రంగా ఉద్దేశపూర్వకంగా గాయపరచడంతో ఈ వేటు పడింది.
ప్రాప్ సిప్రియానో మార్టినెజ్ అనే రగ్బీ క్రీడాకారుడు సాన్ అల్బనో జట్టులోని జువాన్ మసి అనే మరో క్రీడాకారుడిని బలంగా ముఖంపైతన్నాడు. దీంతో అతడికి తీవ్ర గాయం అయింది. ఇది క్రీడకు విరుద్ధం కావడంతోపాటు.. అప్పటికే ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్ని మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అతడిపై వేటు వేయాలని పుకార క్లబ్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,508 వారాలపాటు అతడు రగ్బీ ఆడకుండా నిషేధం విధించగా ఈ క్లబ్ అధ్యక్షుడు ఎడువార్డో బెర్నార్డిలో ఈ నిర్ణయం వెలువరించారు.