Buenos Aires
-
యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): బ్రిటన్ సంగీత సంచలనం, పాప్ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సిటీలోని ఒక విలాసవంత హోటల్ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్ హోటల్ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు. 14 ఏళ్లకే సంచలనం 2010లో బ్రిటన్ ప్రఖ్యాత టాలెంట్ రియాలిటీ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్ డైరెక్షన్’పేరిట బాయ్బ్యాండ్ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్‌ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు. ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్ అయ్యా యి. సొంత ఆల్బమ్స్ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్‌డ్రాప్స్’ పాట అందర్నీ నిరాశపరిచింది. -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్‌కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
ఊగిపోయిన ఫ్లైట్.. ముక్కులు, మూతులు పగిలాయ్!
బ్యూనస్ ఎయిర్స్: ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం ఆకాశంలో ఉండగా.. తీవ్ర కుదుపునకు లోనైంది. ఆ దెబ్బకు ప్రయాణికులు విమానంలో చెల్లాచెదురై గాయపడ్డారు. కొందరు ప్రయాణికులకు ముక్కులు, మూతులు పగిలినట్లు సమాచారం. అట్లాంటిక్ మీదుగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు వణికిపోయనట్లు తెలుస్తోంది. అర్జెంటీనాకు చెందిన ఎయిరోలినియస్ అర్జెంటీనాస్ A330 విమానం భారీ కుదుపునకు లోనైంది. మాడ్రిడ్ నుంచి బ్యూనస్ ఎయిర్స్ వెళ్లాల్సిన విమానం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 18న ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సెక్యూరిటీ బెల్ట్ ధరించాలని సిబ్బంది మమ్మల్ని అప్రమత్తం చేయలేదు. విమానం ఒక్కసారిగా ఊగిపోవడం మొదలైంది. చాలాసేపు అది కుదిపేసింది. దీంతో ఒక్కసారిగా అంతా చెల్లాచెదురై పడిపోయాం అని ఓ ప్రయాణికుడు వెల్లడించారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది సైతం ఇబ్బంది పడ్డారని మరో ప్రయాణికుడు వెల్లడించాడు. Bueno pues hubieron unas turbulencias en las que no nos avisaron para ponernos el cinturón y todo el mundo salió volando. Hasta las azafatas por el pasillo. Estos desperfectos en el avión están hechos con la cabeza. Las últimas 7 horas de vuelo una puta pesadilla. https://t.co/xXdzxYEXmO pic.twitter.com/g5wwmigeWL — Adrianceitor (@adrianceitor_) October 19, 2022 ఆ ఘటన తర్వాత ఏడు గంటలపాటు భయం భయంగా ప్రయాణికులు గడిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎజయిజా విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం నుంచి గాయపడిన వాళ్లకు చికిత్స అందించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వాళ్ల పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిర్‌లైన్స్ నిర్వాహకులు వెల్లడించారు. మరికొందరికి స్వల్పగాయాలు అయినట్లు తెలిపింది. అయితే సిబ్బంది మాత్రం కుదుపులను పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేశామని చెబుతోంది. ఘటన జరిగిన సమయంలో 271 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. విమానంలో చెల్లాచెదురైన విమానం ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. Video Credits: New York Post -
ఇది ఆమెకు కచ్చితంగా పునర్జన్మే!
ఈ వీడియో చూశాక.. ఎవరైనా ఈ మాట అనకమానరు. అదృష్టం ఉంటే మనిషి ఎంతంటి ఆపద నుంచైనా మనిషి బయటపడొచ్చు. అలా ఆమెకు భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టే ఘోర ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఆ షాక్ నుంచి కొన్నిరోజులకు తేరుకున్న యువతి.. తనకిది పునర్జన్మే అని చెబుతోంది ఇప్పుడు. అర్జెంటీనా బ్యూనోస్ ఎయిర్స్ ఇండిపెండెన్స్ స్టేషన్ వద్ద మార్చి 29వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాండెల్లా అనే యువతి.. ప్లాట్‌ఫామ్ మీద నిల్చుని ఉంది. ఆ టైంలో బీపీ డౌన్ అయ్యి కళ్లు తిరిగి తులూతు వెళ్లి.. అప్పుడే వెళ్తున్న రైలుకు తగిలి.. ప్లాట్‌ఫామ్, రైలుకి మధ్య మధ్య పడిపోయింది. అది చూసి.. ఆమె పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, అదృష్టం బాగుండి ఆమె చావును జయించగలిగింది. రైలును ఆపేసి.. ఆమెను ఆ గ్యాప్లోంచి బయటకు తీశారు సిబ్బంది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఆంబులెన్స్‌లో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ వీడియో చూశాక.. తాను నిజంగా బతికి ఉన్నానా? అనే అనుమానం క్యాండెల్లాకు కూడా కలిగిందట. ఇది తనకు పునర్జన్మే అని అంటోందామె. ఇంతకీ.. మీరెమంటారు? -
బలంగా ముఖంపై తన్నినందుకు..
బ్యూనస్ ఎయిర్స్: ఓ అర్జెంటీనా రగ్బీ ప్లేయర్‌పై భారీ స్థాయిలో వేటు పడింది. దాదాపు 29 ఏళ్లపాటు అతడిని ఆ క్రీడ నుంచి సస్పెండ్ చేస్తూ బ్యూనస్ ఎయిర్స్ రగ్బీ యూనియన్(యూఆర్బీఏ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3న పుకారా, సాన్ అల్బానో జట్ల మధ్య జరిగిన రగ్బీ క్రీడలో అతడు మరో వ్యక్తిని తీవ్రంగా ఉద్దేశపూర్వకంగా గాయపరచడంతో ఈ వేటు పడింది. ప్రాప్ సిప్రియానో మార్టినెజ్ అనే రగ్బీ క్రీడాకారుడు సాన్ అల్బనో జట్టులోని జువాన్ మసి అనే మరో క్రీడాకారుడిని బలంగా ముఖంపైతన్నాడు. దీంతో అతడికి తీవ్ర గాయం అయింది. ఇది క్రీడకు విరుద్ధం కావడంతోపాటు.. అప్పటికే ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్ని మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అతడిపై వేటు వేయాలని పుకార క్లబ్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,508 వారాలపాటు అతడు రగ్బీ ఆడకుండా నిషేధం విధించగా ఈ క్లబ్ అధ్యక్షుడు ఎడువార్డో బెర్నార్డిలో ఈ నిర్ణయం వెలువరించారు. -
దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో భారీ భూకంపం!
వాషింగ్లన్: దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదుగా నమోదైందని అమెరికా వాతవరణ శాఖా ప్రకటించింది. భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు అమెరికా భూకంప కేంద్రం వెల్లడించింది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్కు 3259 కిలోమీటర్ల దూరంలో దక్షిణ శాండ్విచ్ దీవుల్లో భూకంప తీవ్రత ఎక్కువగా నమోదైనట్టు సమాచారం.