![Viral Video: Argentina Woman Fall Under Train But Survived - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/20/Argentina_Woman_Save_Video_.jpg.webp?itok=royvZuyg)
ఈ వీడియో చూశాక.. ఎవరైనా ఈ మాట అనకమానరు. అదృష్టం ఉంటే మనిషి ఎంతంటి ఆపద నుంచైనా మనిషి బయటపడొచ్చు. అలా ఆమెకు భూమ్మీద నూకలు ఉన్నాయి కాబట్టే ఘోర ప్రమాదం నుంచి బయటపడగలిగింది. ఆ షాక్ నుంచి కొన్నిరోజులకు తేరుకున్న యువతి.. తనకిది పునర్జన్మే అని చెబుతోంది ఇప్పుడు.
అర్జెంటీనా బ్యూనోస్ ఎయిర్స్ ఇండిపెండెన్స్ స్టేషన్ వద్ద మార్చి 29వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాండెల్లా అనే యువతి.. ప్లాట్‌ఫామ్ మీద నిల్చుని ఉంది. ఆ టైంలో బీపీ డౌన్ అయ్యి కళ్లు తిరిగి తులూతు వెళ్లి.. అప్పుడే వెళ్తున్న రైలుకు తగిలి.. ప్లాట్‌ఫామ్, రైలుకి మధ్య మధ్య పడిపోయింది.
అది చూసి.. ఆమె పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, అదృష్టం బాగుండి ఆమె చావును జయించగలిగింది. రైలును ఆపేసి.. ఆమెను ఆ గ్యాప్‌లోంచి బయటకు తీశారు సిబ్బంది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఆంబులెన్స్‌లో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆ వీడియో చూశాక.. తాను నిజంగా బతికి ఉన్నానా? అనే అనుమానం క్యాండెల్లాకు కూడా కలిగిందట. ఇది తనకు పునర్జన్మే అని అంటోందామె. ఇంతకీ.. మీరెమంటారు?
Comments
Please login to add a commentAdd a comment