kicking
-
ఆ మహిళా జర్నలిస్టుపై వేటు
-
ఆ మహిళా జర్నలిస్టుపై వేటు
శరణార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన హంగేరీ మహిళా వీడియో జర్నలిస్టు పెట్రా లాజ్లోపై వేటు పడింది. ఆమెపై కోర్టు మూడేళ్ల ప్రొబెషన్ బాన్ విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జెజెడ్ పట్టణ న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ఉద్దేశపూర్వకంగా అవమానవీయంగా ప్రవర్తించిందని కోర్టు తేల్చింది. వీడియో లింకు ద్వారా ఆమె తన వాదనలను కోర్టుకు వినిపించారు. అయితే శరణార్థులపై పెట్రా లాజ్లో జాతివివక్షతో దాడి చేయాలని ఆమె తరపు న్యాయవాదులు వాదించారు. సెర్బియా-హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామంలో 2015, సెప్టెంబర్ లో శరణార్థుల పట్ల పెట్రా లాజ్లో ప్రవర్తించిన తీరు లోకానికి వెల్లడికావడంతో ఆమె తీవ్ర విమర్శలకు గురయ్యారు. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి ప్రవేశించిన శరణార్థులకు కాళ్లు అడ్డంపెట్టి పడేసింది. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. శరణార్థులను హింసించిన దృశ్యాలు బయటకు రావడంతో ఎన్1 టీవీ యాజమాన్యం ఆమెను డిస్మిస్ చేసింది. ఉద్యోగ బాధ్యతలు వదిలిపెట్టి జాత్యంహకారంతో ప్రవర్తించినందుకు ఆమె కోర్టు విచారణ ఎదుర్కొవాల్సి వచ్చింది. కోర్టు తీర్పును అప్పీలు చేస్తానని పెట్రా లాజ్లో తెలిపింది. -
బలంగా ముఖంపై తన్నినందుకు..
బ్యూనస్ ఎయిర్స్: ఓ అర్జెంటీనా రగ్బీ ప్లేయర్‌పై భారీ స్థాయిలో వేటు పడింది. దాదాపు 29 ఏళ్లపాటు అతడిని ఆ క్రీడ నుంచి సస్పెండ్ చేస్తూ బ్యూనస్ ఎయిర్స్ రగ్బీ యూనియన్(యూఆర్బీఏ) నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3న పుకారా, సాన్ అల్బానో జట్ల మధ్య జరిగిన రగ్బీ క్రీడలో అతడు మరో వ్యక్తిని తీవ్రంగా ఉద్దేశపూర్వకంగా గాయపరచడంతో ఈ వేటు పడింది. ప్రాప్ సిప్రియానో మార్టినెజ్ అనే రగ్బీ క్రీడాకారుడు సాన్ అల్బనో జట్టులోని జువాన్ మసి అనే మరో క్రీడాకారుడిని బలంగా ముఖంపైతన్నాడు. దీంతో అతడికి తీవ్ర గాయం అయింది. ఇది క్రీడకు విరుద్ధం కావడంతోపాటు.. అప్పటికే ఆ ఘటనకు సంబంధించిన వీడియో అన్ని మీడియాలో హల్ చల్ చేసింది. దీంతో అతడిపై వేటు వేయాలని పుకార క్లబ్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,508 వారాలపాటు అతడు రగ్బీ ఆడకుండా నిషేధం విధించగా ఈ క్లబ్ అధ్యక్షుడు ఎడువార్డో బెర్నార్డిలో ఈ నిర్ణయం వెలువరించారు. -
కస్టమర్‌ను చితక్కొట్టిన బౌన్సర్లు
న్యూఢిల్లీ: పబ్‌కు వచ్చిన ఓ కస్టమర్‌ను వెంటాడి మరీ చితక్కొట్టిన వైనం ఢిల్లీని గుర్గావ్లో చోటుచేసుకుంది. బౌన్సర్ల సాయంతో వినియోగదారుడిపై యాజమాన్యం వాళ్లే దాడికి దిగి తీవ్రంగా గాయపర్చిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ అమానుషం హాట్ టాపిక్ గా మారింది. మార్చి 17వ తేదీ రాత్రి ఇయాన్ పబ్‌కి వెళ్లిన రాకీ (24) డ్యాన్స్ చేస్తున్న క్రమంలో తూలి పక్కనే ఉన్న బౌన్సర్లపై పడ్డాడు. అంతే అగ్రహానికి గురైన బౌన్సర్లు రాకీపై పంచ్‌లతో విరుచుకుపడ్డారు. ఆరుగురు వ్యక్తులు అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దెబ్బలకు తాళలేక కిందపడిపోయినా వాళ్ల అరాచకం ఆగలేదు. విచక్షణరహితంగా దాడిచేశారు. పారిపోవడానికి ప్రయత్నించిన రాకీని కొంత దూరం పాటు వెంటాడి మరీ దాడి కొనసాగించారు. షాపింగ్ మాల్ ఆవరణలో 50 నిమిషాల పాటు కొనసాగిన వారి ఆగడాలు సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. ఈ సంఘటనపై రాకీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. అయితే పబ్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. రాకీ, అతని స్నేహితులు మద్యం సేవించి అమర్యాదకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తోంది.