
బ్రిస్బేన్: యాషెస్ తొలి టెస్టుపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా 56 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీసిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్ల జోరుకు 76 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ స్మిత్, షాన్ మార్‡్ష కీలక భాగస్వామ్యం కంగారు జట్టును కాపాడింది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (64 బ్యాటింగ్) అర్ధ సెంచరీ సాధించగా, షాన్ మార్‡్ష (44 బ్యాటింగ్) రాణించాడు.
వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 89 పరుగులు జోడించారు. ఓపెనర్లు వార్నర్ (26), బెన్‌క్రాఫ్ట్ (5)లతో పాటు ఖాజా (11), హ్యాండ్స్‌కోంబ్ (14) విఫలమయ్యారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 196/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మలాన్ (56) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మొయిన్ అలీ (38) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 83 పరుగులు జత చేయగా... స్టార్క్, కమిన్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో ఆరు వికెట్లతో ఆస్ట్రేలియా మరో 137 పరుగులు వెనుకబడి ఉంది. స్మిత్ ఇంకా క్రీజ్‌లో ఉండటంతో ఆసీస్‌కు ఆధిక్యం దక్కుతుందా లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment