శ్రీవత్సకు షాక్
ఆసియా జూనియర్ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రాష్ట్ర సీడెడ్ క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. బాలుర క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ శ్రీవత్స రాతకొండకు క్వాలిఫయర్ కుశాల్ చేతిలో పరాజయం ఎదురైంది.
బాలికల ఈవెంట్‌లో మూడో సీడ్ సాయి దేదీప్య, ఆరోసీడ్ శ్రీవల్లి రష్మికలు కూడా ఇంటిదారి పట్టగా... నాలుగో సీడ్ శివాని అమినేని సెమీఫైనల్లోకి ప్రవేశించింది. లియోనియా రిసార్ట్స్‌లోని ఇండోర్ టెన్నిస్ కోర్టులో బుధవారం జరిగిన అండర్-14 బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో క్వాలిఫయర్ యెడ్ల కుశాల్ 6-3, 7-5తో టాప్ సీడ్ శ్రీవత్సపై సంచలన విజయం సాధించాడు.
తీర్థ శశాంక్ 6-0, 7-5తో ప్రలోక్ ఇక్కుర్తిపై, హిమాన్షు మోర్ 3-6, 6-3, 6-2తో సచిత్ శర్మపై, నీల్ గరుద్ 6-2, 6-1తో రిత్విక్ చౌదరిపై గెలిచారు. బాలికల క్వార్టర్స్‌లో శివాని 6-3, 4-6, 6-3తో షాజిహా బేగంపై, మహక్ జైన్ 6-1, 6-2తో శ్రీవల్లి రష్మికపై, షేక్ హుమేర బేగం 6-0, 6-2తో సాయి దేదీప్యపై గెలుపొందారు. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మహక్-దేదీప్య జోడి 6-1, 6-1తో శరణ్య-మాన్య ద్వయంపై, నేహ-స్వాతి జంట 6-4, 7-5తో గౌరి-కృతిక జోడిపై, పాన్యభల్లా-శ్రీవల్లి ద్వయం 6-0, 6-1తో గుల్స్ ్రబేగం-తహూరా షేక్ జంటపై, శివాని-శ్రావ్య జోడి 7-5, 6-1తో షేక్ హుమేర-షాజిహా బేగం ద్వయంపై విజయం సాధించాయి.
కుశాల్ సంచలనం
Published Thu, Aug 7 2014 12:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement