పాక్ ప్రభుత్వం భారత్‌తో మాట్లాడాలి
బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ జరిగేందుకు అనువైన పరిస్థితులు లేవని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనేలా చూడటం అన్నికంటే ముఖ్యమైందన్నారు. ‘రెండు దేశాల మధ్య క్రికెట్ ఆడేందుకు అవసరమైన పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మొదట పాక్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో మాట్లాడాలి. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనేందుకు ఇది దోహదపడుతుంది. ప్రభుత్వాలు మాట్లాడుకుంటే రెండు బోర్డుల మధ్య పెద్దగా చర్చలు కూడా అవసరం లేదు’ అని ఠాకూర్ అన్నారు.