BCCI secretary Anurag Thakur
-
పాక్ ప్రభుత్వం భారత్‌తో మాట్లాడాలి
బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ జరిగేందుకు అనువైన పరిస్థితులు లేవని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనేలా చూడటం అన్నికంటే ముఖ్యమైందన్నారు. ‘రెండు దేశాల మధ్య క్రికెట్ ఆడేందుకు అవసరమైన పరిస్థితులు ఇప్పుడైతే లేవు. మొదట పాక్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో మాట్లాడాలి. ఇరుదేశాల మధ్య మంచి వాతావరణం నెలకొనేందుకు ఇది దోహదపడుతుంది. ప్రభుత్వాలు మాట్లాడుకుంటే రెండు బోర్డుల మధ్య పెద్దగా చర్చలు కూడా అవసరం లేదు’ అని ఠాకూర్ అన్నారు. -
ద్రవిడ్ మనసులో ఏముంది?
► కోచ్ పదవిపై తర్జనభర్జన ► వస్తే చూద్దాం... అంటూ మెలిక ముంబై : గత పదిహేనేళ్లుగా భారత క్రికెట్ జట్టు కోచ్‌గా విదేశీయులే ఉన్నారు. ఇప్పుడు భారతీయుడే కోచ్‌గా రావాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి రాహుల్ ద్రవిడ్‌పైనే ఉంది. బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ మేధావి, సౌమ్యుడు, అందరూ గౌరవించే వ్యక్తి... ఈ అర్హతలన్నీ అతనికి సరిగ్గా సరిపోతాయి. అయితే అసలు ద్రవిడ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏడాది క్రితం ‘కోచ్ పదవి అంటే చాలా బాధ్యతతో కూడుకున్నది. ఏడాదిలో కనీసం 11 నెలలు ఆటకు అంకితం కావాలి. నాకంత సమయం లేదు’ అంటూ అతను దీనికి దూరంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాతైనా కామెంటరీతోనో, ఐపీఎల్‌తోనే అతను క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇకపై సమయం అన్నది సమస్య కాకపోవచ్చు. హోదాతో పాటు చెల్లింపులపరంగా చూసినా పైవాటితో పోలిస్తే భారత కోచ్ పదవి ఎంతో కీలకమైంది. ఇప్పుడు అతని తాజా వ్యాఖ్య ఈ పదవిపై ద్రవిడ్ ఆసక్తిని సూచిస్తోంది. ‘ఇప్పుడే భారత కోచ్ పదవి గురించి ఆలోచించడం లేదు. అయితే నా దాకా వస్తే ఆలోచిద్దాం. ఎందుకంటే వంతెన దగ్గరకు వెళ్లాకే ఎలా దాటాలో ఆలోచించడం నా నైజం’ అని తన ఇష్టాన్ని చూచాయగా చెప్పాడు. మరో వైపు భారత క్రికెట్ సలహాదారులుగా ఉండాలంటూ బోర్డు ద్రవిడ్‌తో పాటు సచిన్, గంగూలీలకు కూడా విజ్ఞప్తి చేసింది. కోచ్‌ను ఎంపిక చేసే కమిటీలో కూడా వీరున్నారు. అయితే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నోటిమాటగా చెప్పడం తప్ప దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు లేవు. ద్రవిడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి ‘సలహాదారు’ ఆలోచననుంచి బయటికి వచ్చి పూర్తి స్థాయి కోచ్ కావడాన్నే అతను ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. -
శ్రీనిపై విచారణ జరిపిస్తాం
బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ న్యూఢిల్లీ: క్రికెట్ ప్రక్షాళనలో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్.శ్రీనివాసన్ వ్యవహార శైలిపై విచారణ జరిపించే అవకాశం ఉన్నట్టు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సూచించారు. వీరిద్దరి మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. బుకీతో తనకు సంబంధాలున్నాయని ఐసీసీ పేర్కొనడం వెనుక శ్రీని ఉన్నాడని ఆయన ఆరోపించారు. అలాగే బోర్డు అధికారులపై నిఘా ఉంచేందుకు బ్రిటిష్ ఏజెన్సీతో శ్రీని రూ.14 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. ‘బోర్డు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహార శైలిపై విచారణ జరగాల్సి ఉంది. దీనికి ఎస్‌జీఎంను ఉపయోగించుకోవచ్చు. సాక్ష్యాలేమైనా లభిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం. ఈ సెప్టెంబర్ వరకు బీసీసీఐ నుంచి ఐసీసీలో శ్రీనివాసన్ నామినీగా ఉంటారు. ఆ తర్వాత ఆయన కొనసాగేదీ.. లేనిదీ.. తేలుస్తాం’ అని ఠాకూర్ అన్నారు. -
ప్రముఖులతో గిల్హోత్రాకు పరిచయాలు
-
‘అనుమానితుడు’ అందరితో, అంతటా...
ప్రముఖులతో గిల్హోత్రాకు పరిచయాలు ముంబై : బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌తో సన్నిహితంగా కనిపించి వార్తల్లోకెక్కిన ‘అనుమానిత బుకీ’ కరణ్ గిల్హోత్రా వ్యవహారాలు చాలా ఉన్నాయి. తాజాగా అతనికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం క్రికెటర్లే కాకుండా దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులతో అతను తరచూ కనిపిస్తుంటాడు. చండీగఢ్‌కు చెందిన కరణ్... ఫైవ్ స్టార్ హోటళ్లలో ఇచ్చే భారీ పార్టీలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, ఇతర ప్రభుత్వాధికారులు తరచుగా హాజరు కావడం అతని పరిచయాల స్థాయిని సూచిస్తోంది. ‘ఈ అనుమానిత బుకీ అన్ని మ్యాచ్‌లకు వెళతాడు. క్రికెటర్లందరితో పరిచయాలు ఉన్నాయి. పార్టీల్లో కూడా కనిపిస్తాడు’ అని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నివేదికలో కరణ్ గురించి ప్రస్తావన ఉంది. 2012లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో యువరాజ్ సింగ్‌తో అతను దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు బయటికి వచ్చింది. 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం బయట పడినప్పుడు కూడా కరణ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అతనిపై ఆరోపణలు వచ్చినా... ఎప్పుడూ కనీస స్థాయిలో కూడా ఆధారాలు లభించలేదు. అయితే కరణ్ ఇవన్నీ కొట్టి పారేశాడు. ‘అనురాగ్‌తో నాకు పదేళ్లుగా పరిచయం ఉంది. నాకు క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు మిత్రులుగా ఉన్నారు. వారితో కలిసి పార్టీల్లో పాల్గొన్నంత మాత్రాన తప్పుడు పనులు చేస్తున్నట్లు కాదు. నేను ఇప్పటికే ఐసీసీకి కూడా లేఖ రాశాను. దమ్ముంటే రుజువు చేయండి’ అని అతను వివరణ ఇచ్చాడు.