ఆసీస్ సెమీస్ ఆశలు సజీవం | Australia hammer Ireland and keep Women team hopes alive | Sakshi
Sakshi News home page

ఆసీస్ సెమీస్ ఆశలు సజీవం

Published Sat, Mar 26 2016 7:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

ఆసీస్ సెమీస్ ఆశలు సజీవం

ఆసీస్ సెమీస్ ఆశలు సజీవం

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్ ఏ నుంచి సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ లో నెగ్గి ఆరు పాయింట్లతో న్యూజీలాండ్ తో సమానంగా ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేయగా, ఛేజింగ్ కు దిగిన ఆసీస్ మరో 6.4 ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

ఐర్లాండ్ జట్టులో కిమ్ గార్త్(27), జాయ్స్ (23) మాత్రమే రాణించగా మిగిలిన మహిళా ప్లేయర్స్ విఫలమయ్యారు. ఎలైస్ విల్లాని (43), ఎల్లీస్ పెర్రీ 29 నాటౌట్ రాణించడంతో ఆసీస్ చాలా వేగంగా లక్ష్యాన్ని సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో కిమ్ గార్త్(2/24) మాత్రమే కొంత మేరకు ప్రభావం చూపించింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ స్కట్ 3 వికెట్లు తీయగా, రెనె ఫార్రెల్ 2 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ పతనాన్ని శాసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement