చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా
దుబాయ్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైంది. 221 పరుగుల భారీ తేడాతో ఆసీస్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. 438 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించలేక కంగారూలు చేతులెత్తేశారు. 91.1 ఓవర్లలో 216 పరుగులకు చాపచుట్టేశారు. పాక్ స్పిన్నర్ల ధాటికి ఆసీస్ ఆటగాళ్లు విలవిల్లాడారు.
స్మిత్(55), జాన్సన్(61) మాత్రమే రాణించి అర్థ సెంచరీలు సాధించారు. రోజర్స్ 43, వార్నర్ 23, సిడల్ 15 పరుగులు చేశారు. డూలన్, లియోన్, హాడిన్ డకౌటయ్యారు. మైకేల్ క్లార్క్, మార్ష్ మూడేసి పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో జుల్ఫికర్ బాబర్ 5, యాసిర్ షా 4 వికెట్లు పడగొట్టారు. ఇమ్రాన్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 454, ఆస్ట్రేలియా 303 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగస్ లో పాకిస్థాన్ 286/2 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. రెండు ఇన్నింగ్స్ లోనూ సెంచరీలు సాధించిన పాక్ బ్యాట్స్మన్ యూనిస్ ఖాన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.