బ్యాడ్మింటన్ సంఘంలోకి గోపీచంద్ | BAI has Pullela Gopichand in a 'Frosty' spot | Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్ సంఘంలోకి గోపీచంద్

Published Mon, Jun 23 2014 1:02 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

బ్యాడ్మింటన్ సంఘంలోకి గోపీచంద్ - Sakshi

బ్యాడ్మింటన్ సంఘంలోకి గోపీచంద్

తెలంగాణ కార్యదర్శిగా ఎన్నిక  
 ఆంధ్ర కార్యదర్శిగా పున్నయ్య చౌదరి
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కూడా రెండుగా విడిపోయింది. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల కోసం విడిగా సంఘాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
 
 ఈ సంఘానికి వై. ఉపేందర్ రావు, డాక్టర్ రవీందర్ రావు ఉపాధ్యక్షులుగా, కె. పాణీరావు కోశాధికారిగా వ్యవహరిస్తారు. ఆంధ్ర బ్యాడ్మింటన్ సంఘానికి మాత్రం దాదాపుగా పాత ఏపీ కార్యవర్గమే కొనసాగనుంది. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ఈ సంఘానికి అధ్యక్ష, కేసీ పున్నయ్య చౌదరి కార్యదర్శి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ సంఘానికి రాయపాటి రంగారావు ఉపాధ్యక్షుడిగా, సీహెచ్ రఘుకిరణ్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ‘ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బ్యాడ్మింటన్ బాగా కేంద్రీకృతమై ఉంది. భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధించేందుకు నేను నేరుగా సంఘం కార్యకలాపాల్లో పాల్గొంటే బాగుంటుందని ‘బాయ్’ ఉన్నతాధికారులు సూచించారు. అందుకే కార్యదర్శి బాధ్యతలు తీసుకుంటున్నాను’ అని గోపీచంద్ స్పందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement