షహదత్‌పై అభియోగాలు నమోదు | Bangladesh cricketer charged with torturing maid | Sakshi
Sakshi News home page

షహదత్‌పై అభియోగాలు నమోదు

Published Thu, Dec 31 2015 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

షహదత్‌పై  అభియోగాలు నమోదు

షహదత్‌పై అభియోగాలు నమోదు

 ఢాకా: పని అమ్మాయిని హింసించిన కేసులో బంగ్లాదేశ్ జాతీయ క్రికెటర్ షహదత్ హుస్సేన్‌పై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. చట్ట విరుద్ధంగా బాలికను పనిలో పెట్టుకోవడమే కాకుండా దాడి చేయడం, హింసించడం జరిగినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ ఇన్‌స్పెక్టర్ షఫీకుర్ రెహమాన్ వెల్లడించారు. పోలీసులు చేస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవని హుస్సేన్ వ్యాఖ్యానించాడు. ‘నేను అమాయకుడ్ని.
 
 నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్లకు నా గురించి ఏం తెలుసు. నా కెరీర్‌ను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర ఇది’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌లో షహదత్‌పై ఈ ఆరోపణలు రావడంతో బంగ్లా క్రికెట్ బోర్డు అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ కేసులో దోషులుగా తేలితే హుస్సేన్, అతని భార్యకు 14 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement