బంగ్లా క్రికెటర్ షహాదత్‌పై సస్పెన్షన్ వేటు
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్ షహాదత్ హొస్సేన్‌పై వేటు పడింది. తమ ఇంట్లో పనిచేసే 11 ఏళ్ల చిన్నారిని తన భార్యతో కలిసి దారుణంగా హింసించాడనే ఆరోపణలతో పోలీసులు ప్రస్తుతం ఈ క్రికెటర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అన్ని ఫార్మాట్ల నుంచి తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్రికెటర్‌తో పాటు అతడి భార్య పరారీలో ఉన్నారు. ‘షహాదత్‌పై ఉన్న ఆరోపణలతో బోర్డు ఇమేజి దెబ్బతింది.
అందుకే ముందుగా అతడిపై ఎలాంటి మ్యాచ్‌లు ఆడకుండా తాత్కాలిక నిషే దం విధిస్తున్నాం. విచారణలో తప్పు లేదని తేలితే నిషేధం ఎత్తేస్తాం’ అని బీసీబీ అధికార ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. దీంతో వచ్చే నెలలో ఆసీస్‌తో జరిగే టెస్టుల సిరీస్‌కు తను దూరం కానున్నాడు.