హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ క్రికెటర్ | Shakib Al Hasan And Wife Narrowly Escape Helicopter Crash | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ క్రికెటర్

Published Fri, Sep 16 2016 7:25 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ క్రికెటర్ - Sakshi

హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ క్రికెటర్

ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబల్ హాసన్, ఆయన భార్య ఉమ్మె అహ్మద్ షిషిర్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకున్నారు. శుక్రవారం ఢాకా నుంచి రాయల్ టులీప్ సీ రిసార్ట్కు షకీబల్ దంపతులను తీసుకెళ్లిన హెలికాప్టర్.. అక్కడ వారు దిగిన తర్వాత వెనుదిరిగిన కాసేపటికే కూలిపోయింది. హెలికాప్టర్లో పైలట్ సహా ఐదుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.  

తాను క్షేమంగా ఉన్నానని, అయితే ఈ వార్త వినగానే షాకయ్యానని షకీబల్ అన్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో తాను షూటింగ్లో ఉన్నానని చెప్పాడు. ఓ వాణిజ్య ప్రకటన షూటింగ్ కోసం షకీబల్ తన భార్యతో కలసి రాయల్ టులీప్ సీ రిసార్ట్కు వెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement