విదేశాల్లో మినీ ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ముంబై: విదేశాల్లో మినీ ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యూఏఈ లేదా ఉత్తర అమెరికాలో ఏదో ఓచోట ఈ లీగ్‌ను నిర్వహిస్తారని వార్తలు వస్తున్నా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే యూఏఈ సమయం భారత్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంలో ఈ లీగ్‌ను జరపాలని భావిస్తున్నారు. అప్పటికి భారత జట్టు విండీస్ టూర్ ముగుస్తుంది.
క్రికెట్ సలహా కమిటీ విస్తరణ
విస్తరణలో భాగంగా గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ త్వరలో హై పెర్ఫార్మెన్స్ కమిటీ (హెచ్‌పీసీ)గా మారే అవకాశాలున్నాయి. సెప్టెం బర్‌లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ఈ విషయమై చర్చించనున్నారు. హెచ్‌పీసీలో క్రికెట్ సలహా కమిటీయే కాకుండా సాంకేతిక కమిటీని కూడా విలీనం చేయనున్నారు. దీంట్లో ఆరుగురు సభ్యుల వరకు ఉంటారు.