Mini Ipl
-
అమెరికాలో మినీ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల..!
-
ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ.. తొలి మినీ ఐపీఎల్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్
మినీ ఐపీఎల్‌గా పరిగణించబడే సౌతాఫ్రికా టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ టీమ్ హస్తగతం చేసుకుంది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 12) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్.. 19.3 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. CHAMPIONS‼️‼️‼️@SunrisersEC are the winners of the inaugural #Betway #SA20 🏆 The title is heading to Gqeberha‼️@Betway_India pic.twitter.com/ODHLNdtQke — Betway SA20 (@SA20_League) February 12, 2023 వాన్ డెర్ మెర్వ్ 4, మగాలా, బార్ట్‌మన్ తలో 2 వికెట్లు, జన్సెన్, మార్క్రమ్ చెరో వికెట్ పడగొట్టి ప్రిటోరియాను దారుణంగా దెబ్బకొట్టారు. ప్రిటోరియా ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. That winning moment 🧡🧡🧡#Betway #SA20 @Betway_India pic.twitter.com/b1uI45aYr0 — Betway SA20 (@SA20_League) February 12, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ ఆడమ్ రొస్సింగ్టన్ (30 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకంతో చెలరేగగా, హెర్మన్ (22), కెప్టెన్ మార్క్రమ్ (26), జన్సెస్ (13 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రిటోరియా బౌలర్లలో నోర్జే 2, ఈథన్ బోష్, ఆదిల్ రషీద్, కొలిన్ ఇంగ్రామ్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐపీఎల్ జట్టైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావ్య మారన్.. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో గత కొన్ని సీజన్లుగా సత్తా చాటలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎట్టకేలకు మినీ ఐపీఎల్ టైటిల్ గెలవడం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంది. సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంతో ఎట్టకేలకు కావ్య పాప ఖుషీ అయ్యిందంటూ ఫ్రాంచైజీ అభిమానులు చర్చించుకుంటున్నారు. -
ఏడాదికి రెండు ఐపీఎల్ లీగ్‌లు
న్యూఢల్లీ: క్రికెట్ లీగుల్లో ఐపీఎల్‌కు ఉండే క్రేజే వేరు. అటు ఆటగాళ్లకు, ఇటు బోర్డుకు కాసుల వర్షం కురిపిస్తోంది. భారత్‌లో నిర్వహించే ఈ టోర్నీ క్రికెట్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ టోర్నీని చూడటానికి పలు దేశాలనుంచి క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తునే వస్తారు. ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మినీ ఐపీఎల్ టోర్నీని ప్రవేశపెట్టే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్‌ని ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహించడం సబబుకాదని ఐపీఎల్ చీఫ్ రాజీవ్ శుక్లా అన్నారు. గతంలో నిర్వహించిన ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫెయిల్ అవడంతో, ఇప్పుడు ఆ స్థానంలో ఈ మినీ ఐపీఎల్ ప్రవేశపెట్టాలని బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మినీ ఐపీఎల్ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే మినీ ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తామని రాజీవ్ తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే దుబాయ్‌లో మినీ ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉందని రాజీవ్ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అభిమానుల రెట్టింపు ఆనందం కోసం 2018లో జరగనున్న ఐపీఎల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. రానున్న పది ఏళ్లలో ఐపీఎల్ మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా, ఆకట్టుకునేలా ప్రణాళికలు చేస్తున్నట్లు శుక్లా తెలిపారు. ఫ్రాంచైజీ జట్టు, బీసీసీఐతో ఆదాయాన్ని పంచుకునే విధానం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఐపీఎల్-11వ సీజన్లో 8 జట్లే ఆడతాయని తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీకి ముందు ఐపీఎల్ ఆడటం ఆటగాళ్లకు ఎంతో లాభించిందని, ఫిట్నెస్ మెరుగుపరుచుకుని టోర్నీలో పాల్గొన్నారని శుక్లా తెలిపారు. -
మినీ ఐపీఎల్ కు బ్రేక్!
లాడర్‌హిల్: ఇటీవల అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లు పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో విదేశాల్లో నిర్వహించాలనుకున్నమినీ ఐపీఎల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికాకు క్రికెట్ మార్కెట్ రుచి చూపించినా, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో వెస్టిండీస్ తో జరిగిన టీ 20 సిరీస్ అనుకున్నంత ఆదరణ దక్కలేదు. దీంతో విదేశాల్లో సెప్టెంబర్ లో నిర్వహించాలనుకున్న మినీ ఐపీఎల్ ప్రణాళికల్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు బీసిసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రధానంగా మ్యాచ్ ల సమయం విషయంలో అనుకూలత లేకపోవడమే మినీ ఐపీఎల్ ఆలోచనను పక్కకు పెట్టినట్లు ఆయన తెలిపారు. ' విదేశాల్లో టోర్నీలు నిర్వహించేటప్పుడు సమయంలో వ్యత్యాసాన్ని తప్పకుండా మనం అర్ధం చేసుకోవాలి. భారత్‌లో జరిగే ఐపీఎల్ రాత్రి గం.7.00 నుంచి సుమారు రాత్రి గం.11.30 ని.ల వరకూ ఉంటుంది. అమెరికాలో పగటి మ్యాచ్‌లు జరిగితే, భారత్‌లో ఆ మ్యాచ్‌లను రాత్రి వేళల్లో వీక్షిస్తారు. ఇక్కడ బ్రాడ్ కాస్టింగ్ అనేది చాలా పెద్ద సమస్య. మనం విదేశాల్లో టోర్నీలు జరుపుతున్నప్పుడు భారత అభిమానుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విదేశాల్లో మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు భారత్‌లో టీవీల ద్వారా చూసే వీక్షకుల్ని వదులుకోకూడదు. ప్రత్యేకంగా యూఎస్‌లో మ్యాచ్‌లు జరిగేటప్పుడు అక్కడ ఏ రాష్ట్రంలో మ్యాచ్‌లు ఆడుతున్నాము అనేది కూడా ముఖ్యం. కాకపోతే మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. దానిపై పూర్తి కసరత్తు చేసిన తరువాత మినీ ఐపీఎల్‌పై వివరాలను వెల్లడిస్తాం. ప్రస్తుతానికైతే ఆ టోర్నీకి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం లేదు 'అని ఠాకూర్ తెలిపారు. గత జూన్‌లో విదేశాల్లో మినీ ఐపీఎల్‌ను నిర్వహిస్తామంటూ బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఎస్ లో కానీ, యూఏఈలో కానీ మినీ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావించినా.. తాజాగా అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలతో ఆ టోర్నీ అమెరికాలో జరిగే అవకాశం లేదనే విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. -
యూఏఈలో మినీ ఐపీఎల్!
ముంబై: విదేశాల్లో మినీ ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యూఏఈ లేదా ఉత్తర అమెరికాలో ఏదో ఓచోట ఈ లీగ్‌ను నిర్వహిస్తారని వార్తలు వస్తున్నా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే యూఏఈ సమయం భారత్‌కు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఇక్కడే జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ ప్రారంభంలో ఈ లీగ్‌ను జరపాలని భావిస్తున్నారు. అప్పటికి భారత జట్టు విండీస్ టూర్ ముగుస్తుంది. క్రికెట్ సలహా కమిటీ విస్తరణ విస్తరణలో భాగంగా గంగూలీ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ త్వరలో హై పెర్ఫార్మెన్స్ కమిటీ (హెచ్పీసీ)గా మారే అవకాశాలున్నాయి. సెప్టెం బర్లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ఈ విషయమై చర్చించనున్నారు. హెచ్‌పీసీలో క్రికెట్ సలహా కమిటీయే కాకుండా సాంకేతిక కమిటీని కూడా విలీనం చేయనున్నారు. దీంట్లో ఆరుగురు సభ్యుల వరకు ఉంటారు. -
విదేశాల్లో మినీ ఐపీఎల్!
సెప్టెంబర్‌లో యూఎస్ లేదా యూఏఈలో బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం ధర్మశాల: విదేశాల్లో ‘మినీ ఐపీఎల్’ పేరిట టి20 టోర్నమెంట్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్‌లో అమెరికా లేదా యూఏఈలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో దీంతో పాటు మరికొన్ని అంశాలపై కమిటీ చర్చించింది. ‘పొట్టి ఫార్మాట్లో టోర్నీ ఉంటుంది. ఇంటా, బయటా పద్ధతి ఉండదు కాబట్టి మ్యాచ్‌ల సంఖ్య కూడా తక్కువే. రెండు వారాల విండోలో ఈ టోర్నీని పూర్తి చేయాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. గతేడాది చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేసిన నేపథ్యంలో బోర్డు మినీ ఐపీఎల్‌ను తెరమీదకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. భారత జట్టు చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామాకానికి కూడా కమిటీ ఆమోద ముద్ర వేసింది. అండర్-19 క్రికెట్లోకి వచ్చే ఆటగాడు కేవలం రెండు సీజన్లు మాత్రమే ఆడాలన్న కమిటీ... అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఒకసారి మాత్రమే ఆడాలని నిబంధన విధించింది. టెస్టుల ప్రమోషన్‌కు ప్రత్యేక బడ్జెట్ టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ సీజన్లో స్వదేశంలో 13 టెస్టులు జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్‌లను బాగా మార్కెటింగ్ చేసేందుకు ఆయా రాష్ట్ర సంఘాలతో బోర్డు కలిసి పని చేయనుంది. రంజీ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలన్న టెక్నికల్ కమిటీ నిర్ణయాన్నీ బోర్డు ఆమోదించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థానంలో కొత్తగా జోనల్ టి20 లీగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
త్వరలో మినీ ఐపీఎల్!
ధర్మశాల: ప్రపంచంలో ఉన్న క్రికెట్ లీగ్ ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రధానంగా భారత్‌లో జరిగే ఐపీఎల్‌ను ఇక నుంచి విదేశాల్లో కూడా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. కాగా, భారత్‌కు బయట జరిపే ఈ టోర్నీని 'మినీ ఐపీఎల్' పేరుతో నిర్వహించనున్నట్లు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా వేదికల అన్వేషణలో ఉన్నట్లు పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకూ ఈ టోర్నీని సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు అనురాగ్ పేర్కొన్నారు. ఇందుకు యూఎస్‌తో పాటు యూఏఈ వేదికలు పరిశీలనలో ఉన్నాయి. 2014లో ఐపీఎల్ టోర్నీ జరిగిన యూఏఈలో మినీ టోర్నీ నిర్వహించడానికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఇదిలా ఉండగా, రంజీ ట్రోఫీ టోర్నీలను తటస్థ వేదికలపై నిర్వహించడానికి వర్కింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థానంలో కొత్త టీ 20 లీగ్‌ను నిర్వహించడానికి కూడా అంగీకారం తెలిపింది.