భారత క్రికెటర్ల సంఘం కూడా... | BCCI Approval Community For Indian Cricket Team | Sakshi
Sakshi News home page

భారత క్రికెటర్ల సంఘం కూడా...

Published Wed, Jul 24 2019 7:57 AM | Last Updated on Wed, Jul 24 2019 7:57 AM

BCCI Approval Community For Indian Cricket Team - Sakshi

న్యూఢిల్లీ: ఎట్టకేలకు భారత క్రికెట్‌లోనూ ఆటగాళ్ల కోసం ప్రత్యేక సంఘం సిద్ధమైంది. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)ను ఏర్పాటు చేశారు. దీనికి బోర్డు అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ‘కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 8 ప్రకారం భారత మాజీ క్రికెటర్ల కోసం ఏర్పాటైన ఇండియన్‌ క్రికెటర్ల అసోసియేషన్‌ను బీసీసీఐ అధికారికంగా గుర్తిస్తోంది. ఇది మినహా మరే సంఘానికి కూడా బోర్డు గుర్తింపు ఉండదు’ అని బీసీసీఐ ప్రకటించింది. ఈ సంఘానికి బోర్డు ఆరంభంలో కొంత మొత్తం నిధులు అందజేస్తుందని... అయితే ఆ తర్వాత మాత్రం సొంత ఆదాయమార్గాలు చూసుకోవాలని కూడా బోర్డు సూచించింది. ఐసీఏకు ఎన్నికలు నిర్వహించే వరకు కపిల్‌ దేవ్, అజిత్‌ అగార్కర్, శాంత రంగస్వామి డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఈ సంఘంలో మాజీ క్రికెటర్లకు మాత్రమే సభ్యత్వం ఇస్తారు. ప్రస్తుతం జాతీయ జట్లకు  ఆడుతున్న వారు సభ్యత్వానికి అనర్హులు. ఇతర దేశాల్లో మాత్రం ప్రస్తుతం క్రికెట్‌ ఆడుతున్న వారికి కూడా సభ్యత్వం కల్పిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement