
న్యూఢిల్లీ: కోవిడ్–19పై పోరాటానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందుకొచ్చింది. ప్రధానమంత్రి సహాయనిధికి తమ వంతుగా రూ. 51 కోట్లు విరాళం ఇస్తున్నట్లు శనివారం ప్రకటించింది. మరోవైపు భారత క్రికెటర్ సురేశ్ రైనా రూ. 52 లక్షలను విరాళంగా ప్రకటించాడు. ఇందులో రూ. 31 లక్షలు పీఎం కేర్స్ నిధికి... రూ. 21 లక్షలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఇస్తాడు. ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన భారత క్రీడాకారుల్లో సురేశ్ రైనాదే అత్యధిక మొత్తం కావడం విశేషం. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం రూ. 50 లక్షలు విరాళం ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment