ఈనెల 25న భారత జట్టు కోచ్ ప్రకటన! | BCCI may announce new coach by June 25 | Sakshi
Sakshi News home page

ఈనెల 25న భారత జట్టు కోచ్ ప్రకటన!

Published Tue, Jun 14 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

ఈనెల 25న భారత జట్టు కోచ్ ప్రకటన!

ఈనెల 25న భారత జట్టు కోచ్ ప్రకటన!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎవరనేది తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు బయల్దేరే లోపలే కోచ్ ను ఎంపిక చేసే అవకాశాలు కనబడుతున్నాయి.  ఈ మేరకు బీసీసీఐ కసరత్తులు ఆరంభించింది.  ఈనెల 25వ తేదీన కోచ్ ఎంపిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తాజాగా స్పష్టం చేశారు.  దీనిలో భాగంగా ఈనెల 24వ తేదీన ధర్మశాలలో జరిగే బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో కోచ్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండగా భారత్ కోచ్ పదవికి 57 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి మాజీ ఆటగాళ్లు రవిశాస్త్రి, సందీప్ పాటిల్, వెంకటేశ్ ప్రసాద్, అనిల్ కుంబ్లే తదితరులు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. వచ్చే నెలలో విండీస్ లో భారత పర్యటించనున్న సంగతి తెలిసిందే. జూలై 9వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ వరకూ విండీస్ లో భారత పర్యటన సాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement