'అంతా కోహ్లి భజన చేస్తున్నారు' | BCCI officials worshipped Kohli more than Indian cabinet worships Narendra Modi, says Guha | Sakshi
Sakshi News home page

'అంతా కోహ్లి భజన చేస్తున్నారు'

Published Sun, Jan 21 2018 11:13 AM | Last Updated on Sun, Jan 21 2018 11:13 AM

BCCI officials worshipped Kohli more than Indian cabinet worships Narendra Modi, says Guha - Sakshi

న్యూఢిల్లీ:ప్రస్తుత భారత క్రికెట్‌  కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అంతా కెప్టెన్ విరాట్‌ కోహ్లి భజన బ్యాచ్‌గా మారిపోయిందని క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీఓఏ) మాజీ  సభ్యుడు రామచంద్ర గుహా విమర్శించారు. ఇది ఎంతలా అంటే కేంద్ర కేబినెట్‌ ప్రధాన నరేంద్ర మోదీని స్తుతించడం కంటే ఎక్కువగా ఉందంటూ చురకలంటించారు. ఈ మేరకు టెలిగ్రాఫ్‌ వార్తాసంస్థకు రాసిన కాలమ్‌లో కోహ్లిపై రామచంద్ర గుహా ధ్వజమెత్తారు. భారత క్రికెట్‌ బోర్డు అధికారులు, సెలెక్టర్లు, కోచింగ్‌ సిబ్బంది అంతా కూడా కోహ్లి ముందు చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తున్నారన్నాడు. వారంతా కోహ్లి ముందు మరగుజ్జుల్లా కనిపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా బోర్డులో అవినీతి, బంధుప్రీతి ఉండగా దానికి అదనంగా కోహ్లి భజన ఒకటి వచ్చి చేరిందన్నాడు. దీన్ని ‘సూపర్‌ స్టార్‌ సిండ్రోమ్‌’ అంటూ ఎద్దేవా చేశాడు.

బీసీసీఐలో తనకు సంబంధం లేని విషయాల్ని కూడా కోహ్లి ప్రభావం కనబడుతుందంటే ఇది భజన కాక ఏమిటని ప్రశ్నించాడు. కానీ కుంబ్లే ఒక్కడే అతడి ముందు స్వతంత్రంగా వ్యవహరించగల్గిన వ్యక్తి అని గుహా పేర్కొన్నాడు.భవిష్యత్‌ టూర్‌ షెడ్యూల్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ వ్యవహారాలపై కోహ్లి అంగీకారం తీసుకోవాల్సిన పరిస్థితి నేటి బోర్డులో కనిపిస్తుందన్నాడు. ఈ విషయాన్ని బోర్డు లీగల్‌ కౌన్సిల్‌, సీఈవో సూచించిన విషయాన్ని గుహా ప్రస్తావించారు. అసలు అనిల్‌ కుంబ్లే తన కోచ్‌ పదవి నుంచి వైదొలగడానికి కారణం ఎవరో అందరికీ తెలుసంటూ ఈ సందర్బంగా గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement