ముంబై: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లండ్ వేడికగా జరగనున్న ప్రపంచకప్‌లో భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్‌పై నీలి మేఘాలు అలుముకున్నాయి. రెండు పాయింట్లు కోల్పోయినా సరే... పాక్‌తో మ్యాచ్ ఆడరాదంటూ భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 16న మాంచెస్టర్‌లో జరగాల్సిన ఈ మ్యాచ్‌పై బీసీసీఐ ఆలోచనలో పడింది. దీనిపై బోర్డు సభ్యులు చర్చించికున్నట్లు సమాచారం. ప్రపంచకప్‌లో భారత్-పాక్‌లు ఆడాలా, వద్దా అనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పాక్‌తో మ్యాచ్ వద్దంటే తప్పకుండా ఆడకుండా ఉంటామని ఆ అధికారి తెలిపారు. అయితే ఇప్పటివరకైతే ఈ మ్యాచ్ గురించి ఐసీసీతో చర్చించాలని అనుకోవటం లేదన్నాడు. కేంద్ర ప్రభుత్వం, అభిమానుల అభీష్టం మేరకే బీసీసీఐ నడుచుకుంటందని స్పష్టం చేశారు. (ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్)
ఇక భారత్-పాక్ జట్లు 2012-13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. కేవలం ఐసీసీ, ఆసియా కప్ లాంటి మెగా టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అయితే లీగ్ మ్యాచ్‌లో ఆడకుండా ఉన్నా.. సెమీస్ లేక ఫైనల్‌లో ఆడాల్సి వస్తే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్పడయితే తప్పకుండా ఆడాల్సిందే కదా అని అంటున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీంతో యావత్ దేశం ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉగ్రదాడి వెనుక పరోక్షంగా పాక్ హస్తం ఉందంటూ మండిపడుతున్నారు. ఇక ఇప్పటికే అమరజవాన్ల కుటుంబాలకు భారత క్రికెటర్లు, బీసీసీఐ బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. (ప్రస్తుతానికైతే మార్పు లేదు!)
Comments
Please login to add a commentAdd a comment