
న్యూఢిల్లీ: అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా గుర్తింపు ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు రూ. 860 కోట్లు బకాయి పడింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కార్యకర్త సుభాష్ అగర్వాల్ దరఖాస్తుకు స్పందించిన ఐటీ శాఖ బీసీసీఐ పన్ను చెల్లింపు వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 9వ తేదీ వరకు బీసీసీఐ చెల్లించాల్సిన మొత్తం ఆదాయపు పన్ను రూ. 1325.31 కోట్లు. అయితే ఇందులో (2014–15 అసెస్‌మెంట్ ఇయర్) రూ. 864.78 కోట్లు ఇదివరకే చెల్లించింది.
ఇంకా రూ.460.52 కోట్లు బకాయి పడింది. దీనికి 2015–16 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన పన్ను రూ. 400 కోట్లు కలపడంతో మొత్తం పన్ను బకాయి రూ. 860. 52 కోట్లకు చేరిందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. బకాయి మొత్తాలను రాబట్టుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని ఐటీ శాఖ సమాచార కమిషనర్ బిమల్ జుల్కా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment