
జడేజాకు బీసీసీఐ బాసట
ముంబై: భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు బీసీసీఐ అండగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్తో గొడవ పడిన వివాదంలో ఐసీసీ జడేజాకు జరిమానా విధించడాన్ని బోర్డు ఆక్షేపించింది. ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఆండర్సన్ తో వివాదంలో జడేజాను ఐసీసీ దోషిగా నిర్ధారించింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టి జరిమానా విధించింది. నాటింగ్హామ్ లో జరిగిన మొదటి టెస్టులో ఆండర్సన్, జడేజా గొడవ పడిన సంగతి తెలిసిందే. జడేజా ఐసీసీ చట్టంలోని లెవన్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీ ప్రకటించింది.
కాగా జడేజాతో జరిగిన గొడవకు సంబంధించి అండర్సన్ విచారణ ఆగస్ట్ 1న జరగనుంది. ఈ వివాదంపై లెవెల్ 3 అభియోగం ఎదుర్కొంటు న్న అండర్సన్‌ను..1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయీస్ విచారిస్తారు.