ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ కాలేజి మహిళల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను భవాన్స్ కాలేజి జట్టు కైవసం చేసుకుంది. సైనిక్‌పురిలోని భవాన్స్ కాలేజి మైదానంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో భవాన్స్ కాలేజి 8-1 స్కోరుతో సెయింట్ ఫ్రాన్సిస్‌పై ఘన విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రైల్వే డిగ్రీ కాలేజి 11-7 స్కోరుతో సెయింట్ ఆన్స్ కాలేజిపై గెలిచింది.
సెమీఫైనల్లో భవాన్స్ 17-4తో సెయింట్ ఆన్స్‌పై, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజి 12-5తో రైల్వే కాలేజిపై నెగ్గాయి. విజేతలకు భవాన్స్ కాలేజి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై.అశోక్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డెరైక్టర్ డాక్టర్ జి.కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.
భవాన్స్‌కు మహిళల సాఫ్ట్‌బాల్ టైటిల్
Published Fri, Oct 4 2013 11:45 PM | Last Updated on Fri, Sep 1 2017 11:20 PM
Advertisement
Advertisement