ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-19 జూనియర్ కాలేజి సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్‌లో బాలికల టీమ్ టైటిల్‌ను హైదరాబాద్ జట్టు చేజిక్కించుకుంది. బాలుర విభాగంలో కరీంనగర్ జట్టు విజేతగా నిలిచింది. కరీంనగర్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో శనివారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్ జట్టు 17-3 స్కోరుతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. సెమీఫైనల్లో హైదరాబాద్ 22-5తో మెదక్‌పై, కరీంనగర్ 15-5తో వరంగల్‌పై గెలిచాయి.
బాలుర విభాగం ఫైనల్లో కరీంనగర్ 2-0తో నెల్లూరుపై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 14-1తో నిజామాబాద్‌పై గెలిచింది. సెమీస్‌లో కరీంనగర్ 5-2తో మహబూబ్‌నగర్‌పై, నెల్లూరు 9-0తో నిజామాబాద్‌పై నెగ్గాయి. ఈ పోటీల ముగింపు వేడుకలకు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి కె.విజయారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధు జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బాలికలకు టైటిల్
Published Sun, Oct 13 2013 12:10 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement