భువనేశ్వర్ కుమార్(ఫైల్)
దుబాయ్: టీమిండియా మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది ఐసీసీ 'పీపుల్స్ ఛాయిస్ అవార్డు' గెల్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న నాలుగో క్రికెటర్ గా భువనేశ్వర్ నిలిచాడు.
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కెప్టెన్ షార్లెట్ ఎడ్వార్డ్స్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్, శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ పోటీ పడినప్పటికీ భువన్ కే అవార్డు దక్కింది. తనకు ఓటు వేసిన వారందరికీ భువనేశ్వర్ ధన్యవాదాలు తెలిపాడు.
2010లో ఈ అవార్డును ప్రవేశపెట్టారు. అదే ఏడాది సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారం అందుకున్నాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర వరుసగా రెండుసార్లు(2011, 2012) ఈ అవార్డు దక్కించుకున్నాడు. 2013లో మహేంద్ర సింగ్ ధోని ఈ అవార్డుకు ఎంపికైయ్యాడు.