ఐపీఎల్‌కు స్టార్క్ దూరం
ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిషెల్ స్టార్క్ ప్రకటించాడు. పరస్పర అవగాహనతో ఆర్‌సీబీతో అనుబంధం ముగించిన స్టార్క్, ఐపీఎల్‌లో ఏ జట్టుకూ అందుబాటులో ఉండటం లేదు. ఆసీస్ తరఫున బిజీ షెడ్యూల్‌తో పాటు కుటుంబంతో సమయం గడపాలని భావించడమే ఇందుకు కారణమని స్టార్క్ వెల్లడించాడు.