బ్రెజిల్ తొలి ప్రత్యర్థి క్రొయేషియా | Brazil to face Croatia in Football World Cup opener | Sakshi
Sakshi News home page

బ్రెజిల్ తొలి ప్రత్యర్థి క్రొయేషియా

Published Sat, Dec 7 2013 2:11 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

బ్రెజిల్ తొలి ప్రత్యర్థి క్రొయేషియా - Sakshi

బ్రెజిల్ తొలి ప్రత్యర్థి క్రొయేషియా

సాల్వెడార్:  సొంతగడ్డపై వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను క్రొయేషియా జట్టుతో ఆడుతుంది. వచ్చే సంవత్సరంలో జూన్ 12 నుంచి జూలై 13 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. జూన్ 12న సావోపాలోలో క్రొయేషియాతో జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌తో బ్రెజిల్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 17న మెక్సికోతో; 23న కామెరూన్‌తో బ్రెజిల్ తలపడుతుంది. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు.

లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ స్పెయిన్ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. ఈసారి విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 3 కోట్ల 50 లక్షల డాలర్ల (రూ. 214 కోట్లు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి.
 ఆయా గ్రూప్‌ల వివరాలు: గ్రూప్ ‘ఎ’: బ్రెజిల్, క్రొయేషియా, మెక్సికో, కామెరూన్. గ్రూప్ ‘బి’: స్పెయిన్, నెదర్లాండ్స్, చిలీ, ఆస్ట్రేలియా. గ్రూప్ ‘సి’: కొలంబియా, గ్రీస్, ఐవరీకోస్ట్, జపాన్. గ్రూప్ ‘డి’: ఉరుగ్వే, కోస్టారికా, ఇంగ్లండ్, ఇటలీ. గ్రూప్ ‘ఇ’: స్విట్జర్లాండ్, ఈక్వెడార్, ఫ్రాన్స్, హోండూరస్. గ్రూప్ ‘ఎఫ్’: అర్జెంటీనా, బోస్నియా హెర్జెగోవినా, ఇరాన్, నైజీరియా. గ్రూప్ ‘జి’: జర్మనీ, పోర్చుగల్, ఘనా, అమెరికా. గ్రూప్ ‘హెచ్’: బెల్జియం, అల్జీరియా, రష్యా, దక్షిణ కొరియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement