నిఖత్‌కు కాంస్యం | Bronze medal to nikitha | Sakshi
Sakshi News home page

నిఖత్‌కు కాంస్యం

Published Tue, Jan 21 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

Bronze medal to nikitha

గువాహటి: జాతీయ జూనియర్, యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ బాను కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సోమవారం జరిగిన యూత్ బాలికల సెమీఫైనల్లో ఏపీ అమ్మాయి 1-4తో కృతివిక సిన్హా (పశ్చిమ బెంగాల్) చేతిలో పరాజయం పాలైంది. ఐదు గేమ్‌ల పాటు సాగిన ఈ పోరులో నిఖత్ కేవలం ఒక్క గేమ్‌లోనే గెలిచింది.

6-11, 7-11, 10-12, 11-4, 9-11తో తన డబుల్స్ భాగస్వామి కృతివిక చేతిలో ఓడింది. జూనియర్ బాలికల విభాగంలో రాష్ట్రానికి చెందిన మరో అమ్మాయి ఆకుల శ్రీజ నిరాశపరిచింది. జూనియర్ బాలికల ఈవెంట్‌లో ఆమె 2-4 (11-3, 9-11, 11-13, 10-12, 11-5, 9-11)తో సాగరిక ముఖర్జీ (పశ్చిమ బెంగాల్) ధాటికి కంగుతింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement