సెమీస్‌లో తెలంగాణ | Telangana TT reaches the semi final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో తెలంగాణ

Published Thu, Nov 27 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

సెమీస్‌లో తెలంగాణ

సెమీస్‌లో తెలంగాణ

జాతీయ జూనియర్, యూత్ టీటీ

 అలెప్పీ (కేరళ): జాతీయ జూనియర్, యూత్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయిల జట్టు సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్‌ను 3-2తో ఓడించిన తెలంగాణ జట్టు సెమీస్‌లో కేరళతో తలపడుతుంది. 76వ సీజన్‌గా జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణ జట్టు తొలిసారి పాల్గొంది. నైనా జైస్వాల్ తానాడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆకుల శ్రీజ ఒక మ్యాచ్‌లో నెగ్గి తెలంగాణ సెమీస్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించింది. తొలి సింగిల్స్‌లో నైనా11-7, 10-12, 11-7, 11-3తో షోబబ్తి మెయిత్రాపై... రెండో సింగిల్స్‌లో 6-11, 11-7, 7-11, 11-8, 11-7తో ప్రాప్తి సేన్‌పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement