నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు.. | bumrah undisciplined bowling against pakistan | Sakshi
Sakshi News home page

నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు..

Published Sun, Jun 18 2017 3:32 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు.. - Sakshi

నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు..

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ ఒక లైఫ్ తో బతికి బయటపడ్డాడు.  ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ లో భాగంగా బూమ్రా వేసిన తొలి బంతిని జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. దాంతో భారత జట్టులో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.

 

కాగా, ఆ బంతిని థర్డ్ అంపైర్ కు ఇవ్వడంతో అది నో బాల్ గా తేలింది. ఆనందం కాస్తా తుస్ మంది. ఒక లైఫ్ తో బతికి పోయిన ఫకార్ జమాన్ పాకిస్తాన్ కు కీలక ఆటగాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో అతను ఏమైనా భారీ ఇన్నింగ్స్ సాధిస్తే మాత్రం అది తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement