
నిరాశగా బై.. బై...
ఐపీఎల్‌ను నగర అభిమానులు విశేషంగా ఆదరించారు. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌కూ అభిమానులు పోటెత్తారు. ప్లే ఆఫ్‌కు చేరడానికి చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు చేతులెత్తేయడంతో నగర అభిమానులు నిరాశగా ఈ సీజన్‌కు గుడ్‌బై చెప్పారు.
ప్రమాదం తప్పింది
మ్యాచ్ ఆరంభానికి ముందు స్టేడియంలో చిన్నపాటి ప్రమాదం జరిగింది. సౌత్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్‌లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ బాక్స్ ముందు భారీ సైజు అద్దం కుప్పకూలింది. ఎలాంటి ఘటన లేకుండా, బలమైన వస్తువేదీ తగలకుండా అనూహ్యంగా అద్దం పగలటం దాని ముందు కూర్చున్నవారిని ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. వారు భయంతో పరుగెత్తారు. అప్పటికి మ్యాచ్ టాస్ కూడా వేయకపోవడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు చేరలేదు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- సాక్షి, హైదరాబాద్