మెల్‌బోర్న్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీసుకున్న ‘సూపర్ సిరీస్’ ఆలోచనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా టాప్-4 క్రికెట్ దేశాలకు సూపర్ సిరీస్ నిర్వహించాలని ఇటీవల గంగూలీ ప్రతిపాదించాడు. దీనిపై ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ కూడా అందుకు సరే అంటుంది. అదే సమయంలో ఇది గంగూలీకి వచ్చిన విన్నూత్న ఆలోచన అంటూ సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ ప్రశంసించాడు.
‘ గంగూలీ తెరపైకి తీసుకొచ్చిన వన్డే సూపర్ సిరీస్ ఐడియా చాలా బాగుంది.గంగూలీకి వచ్చిన మరో ఆలోచన ఇది. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే డే అండ్ నైట్ టెస్టుకు గంగూలీ మొగ్గుచూపాడమే కాకుండా అంతే వేగంగా నిర్ణయం తీసుకున్నాడు. అతి తక్కువ సమయంలో గంగూలీ చేస్తున్న ప్రయత్నాలు భేష్. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పటికే ఎన్నో మంచి ఫలితాలు సాధించాడు. ఇప్పుడు సూపర్ సిరీస్ ఐడియా కూడా అభినందనీయం’ అని కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. మరొకవైపు అంతర్జాతీయ తమ సంబంధాలు బాగుండటం కూడా చాలా ముఖ్యమైనదన్న రాబర్ట్స్.. మిగతా దేశాల్లో క్రికెట్‌ను అభివృద్ధి జరగడానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నాడు. త్వరలోనే అఫ్గానిస్తాన్‌తో క్రికెట్ సిరీస్ నిర్వహించడానికి సన్నహాలు చేస్తున్నమని, ఇది క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే తమ నిబద్ధతకు ఒక ఉదాహరణ అని రాబర్ట్స్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment