క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ | Canada Open: Indian shuttlers enter third round of Grand Prix badminton tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్

Published Sat, Jul 2 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్

క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్

కాల్గారి: కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతోంది. సింగిల్స్‌లో ఆరుగురు ఆటగాళ్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ సాయి ప్రణీత్ 21-19, 21-12తో వెంచో షి (కెనడా)పై; టాప్‌సీడ్ అజయ్ జయరామ్ 21-10, 21-12తో డేవిడ్ ఒబెర్నోస్టెరర్ (ఆస్ట్రియా)పై; రెండోసీడ్ హెచ్.ఎస్.ప్రణయ్ 21-18, 18-21, 21-12తో సంకీర్త్ (కెనడా)పై; హర్షిల్ డాని (భారత్) 21-9, 21-18తో ప్రతుల్ జోషి (భారత్)పై గెలవగా,

ఆర్‌ఎంవీ గురుసాయిదత్ 12-21, 21-7, 17-21తో రౌల్ మస్త్ (ఈస్టోనియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో గద్దె రుత్వికా శివాని 24-22, 21-18తో బ్లాడాఫ్ (ఆస్ట్రియా)పై; తన్వీలాడ్ 21-14, 21-15తో మయా చెన్ (అమెరికా)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి 21-8, 21-10తో తిమోతి చో-జాసన్ షూ (కెనడా)పై; మిక్స్‌డ్ డబుల్స్‌లో మను అత్రి-అశ్విని 21-14, 21-12తో లాయ్-టోంగ్ (కెనడా)పై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement