సీసీఎల్ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్, అంజలి
ముంబై: సినీతారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) నాలుగో సీజన్ ఫైనల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. 2014 జనవరి 25న ముంబైలో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్‌ను హైదరాబాద్‌లో ఫిబ్రవరి 23న నిర్వహిస్తారు.
సీసీఎల్ షెడ్యూల్‌కు సంబంధించిన కార్యక్రమం శుక్రవారం రాత్రి ముంబైలో జరిగింది. సచిన్ టెండూల్కర్, తన భార్య అంజలితో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాడు. టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. టాలీవుడ్ జట్టు తెలుగు వారియర్స్ ‘బి’గ్రూప్‌లో ఉంది. ఈ కార్యక్రమంలో హీరో వెంకటేశ్, తరుణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.