సింగిల్స్ విజేత చెన్ లాంగ్ | Chen Long beats Lee Chong Wei in finals | Sakshi
Sakshi News home page

సింగిల్స్ విజేత చెన్ లాంగ్

Published Sat, Aug 20 2016 7:58 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

సింగిల్స్ విజేత చెన్ లాంగ్

సింగిల్స్ విజేత చెన్ లాంగ్

రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ గేమ్లో మహిళలు నిరాశపరిచినా పురుషుల విభాగంలో ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. రియోలో స్వర్ణం కోసం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనాకు చెందిన చెన్ లాంగ్ విజయం సాధించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్, మలేసియా స్టార్ షట్లర్ లీ చోంగ్ వీ పై 21-18, 21-18 తేడాతో గెలుపొంది చైనా ఖాతాలో మరో స్వర్ణం జత చేశాడు.


రెండు గేమ్స్ లోనూ మ్యాచ్ హోరాహోరాగా సాగింది. అయితే మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చెన్ లాంగ్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచాడు. ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు లీ చోంగ్ వీ గట్టి పోటీ ఇచ్చినా ఒక్క గేమ్ కూడా నెగ్గకపోవడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్ లోనూ చైనా ఆటగాళ్లు స్వర్ణం కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement