ముంబై:ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి రెండు కోల్పోయి 79 పరుగులు చేసింది. ముంబై విసిరిన 188పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డ్వేన్ స్మిత్ డకౌట్ గా వెనుదిరిగి అభిమానులను నిరాశపరిచాడు. తరువాత మైక్ హస్సీ(16)పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఆ తరుణంలో డుప్లెసిస్ కు జత కలిసిన సురేష్ రైనా ఇన్నింగ్స్ మర్మమత్తులు చేపట్టాడు. ప్రస్తుత డు ప్లెసిస్ (39),రైనా(20)క్రీజ్ లో ఉన్నారు.