చెపాక్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత‍్కంఠ భరితంగా సాగిన పోరులో చెన్నై సూపర్‌కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విసిరిన 203 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఇంకా బంతి ఉండగానే ఛేదించి అద్భుతమైన గెలుపును అందుకుంది. చెన్నై ఆటగాళ్లలో(42;19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక‍్సర్లు), అంబటి రాయుడు(39;26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్యామ్ బిల్లింగ్స్(56; 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)లు రాణించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎంఎస్ ధోని(25) మోస్తరగా ఫర్వాలేదనిపించాడు. చివరి బంతికి రవీంద్ర జడేజా(11 నాటౌట్) సిక్స్‌తో ఇన్నింగ్స్ ముగించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 203 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 89 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్ తన బ్యాటింగ్‌లో పవర్ చూపించాడు. ప్రధానంగా మ్యాచ్ చివర్లో రసెల్ మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. వరుసగా సిక్సర్ల కొడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ 36 బంతుల్లో 11 సిక్సర్లు, 1 ఫోర్‌తో 88 పరుగులు సాధించి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. 26 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించిన రసెల్.. ఆపై మరింత దూకుడుగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో సహకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment