టేక్‌ ఇట్‌ ఈజీ బ్రదర్‌: కేకేఆర్‌ పేసర్‌ | Vinay Kumar Defends Himself After Fans Lash Out At Him For Poor Last Over | Sakshi
Sakshi News home page

టేక్‌ ఇట్‌ ఈజీ బ్రదర్‌: కేకేఆర్‌ పేసర్‌

Published Wed, Apr 11 2018 6:05 PM | Last Updated on Wed, Apr 11 2018 6:38 PM

Vinay Kumar Defends Himself After Fans Lash Out At Him For Poor Last Over - Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11సీజన్‌లో మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చివరి వరకూ జరిగిన ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. చివరి ఓవర్‌లో చెన్నై విజయానికి 17 పరుగుల కావాల్సిన తరణంలో కేకేఆర్‌ పేసర్‌ వినయ్‌ కుమార్‌ అత్యంత పేలవంగా బౌలింగ్‌ వేశాడు.చెన్నైకు కావాల్సిన పరుగుల్ని బంతి మిగిలి ఉండగానే సమర్పించుకుని కేకేఆర్‌ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేశాడు. దాంతో వినయ్‌ కుమార్‌పై కేకేఆర్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

‘చెన్నైకి 17 పరుగులే అవసరమైతే వినయ్‌ మాత్రం 19 పరుగుల్ని ఇచ‍్చాడంటూ ఒక అభిమాని విమర్శించగా, నిన్ను ఎలా కొట్టారో చూడు అంటూ వినయ్‌ కుమార్‌ అద్దంలో ఆత్మవిమర్శ చేసుకుంటున్న ఫొటోను మరొక అభిమాని పోస్ట్‌ చేశాడు. ఇలా పలువురు అభిమానులు వెటరన్‌ క్రికెటర్‌ వినయ్‌ బౌలింగ్‌లో పసలేదంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

తనపై వస్తున్న విమర్శలను తేలిగ్గా తీసుకున్న వినయ్‌ కుమార్‌ అదే తరహాలో సమాధానమిచ్చాడు. ‘టేక్‌ ఇట్‌ ఈజీ బ్రదర్‌. మ్యాచ్‌లో ఇవన్నీ భాగం. ఆటలో ఏమి జరుగుతుందో ఊహించడం కష్టం. గతంలో​ నేను చివరి ఓవర్‌లో 9, 10 పరుగుల్ని కాపాడిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు మనం ఒకటి చేయాలనుకుంటే దాని ఫలితం మరొకలా ఉంటుంది. అప్పుడు పర‍్యవసానాలు చాలా హాట్‌ హాట్‌గా ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది’ అని వినయ్‌ కుమార్‌ ట్విట్టర్‌ వేదిగా తనను కాపాడుకునే యత్నంచ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement