న్యూఢిల్లీ: భారత్‌లో అన్ని క్రికెట్ మ్యాచ్‌లు రద్దుతో ఆటగాళ్లకు మంచే జరుగనుందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న క్రికెటర్లకు తగినంత విశ్రాంతి లభించిందన్నాడు. ‘భారత క్రికెటర్లకి దొరికిన విశ్రాంతి మంచిదే. ఎందుకంటే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో సుదీర్ఘ సిరీస్ ఆడారు. ముఖ్యంగా.. మూడు ఫార్మాట్ల ఆడిన క్రికెటర్లు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయారు. గత 10 నెలల నుంచి టీమిండియా వరుసగా సిరీస్‌లు ఆడుతూనే ఉంది. కాబట్టి ఈ బ్రేక్ ద్వారా మళ్లీ క్రికెటర్లు ఫ్రెష్‌గా చార్జ్ అవుతారు’ అని అన్నాడు.
‘కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రీడా ఈవెంట్‌లు రద్దు కావడంతో తొలుత షాక్‌కు గురయ్యాం. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో రెండో వన్డే ఆడే సమయానికి ఉన్న పళంగా సిరీస్ రద్దయ్యింది. ఆ తర్వాత కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందడంతో భారత్ ఆడే అన్ని టోర్నీలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సఫారీల రెండో వన్డే తర్వాతే చాలా టోర్నీలు రద్దు అవుతాయనే విషయం క్రికెటర్లకు అర్ధమైంది’ అని రవిశాస్త్రి అన్నాడు.
ఇక న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్‌కు సరైన సమయంలోనే వచ్చామన్నాడు. ‘ కివీస పర్యటన తర్వాత మేము సింగపూర్ మీదుగా భారత్‌కు వచ్చాం. అప్పటికే కోవిడ్-19 వైరస్ వ్యాప్తి గురించి సమాచారం ఉంది. దాంతో రాబోవు సిరీస్‌లు జరగడం కష్టమనే విషయం న్యూజిలాండ్ పర్యటనలో ఊహించాము. సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి.. క్రికెట్ సిరీస్‌లు రద్దు తప్పదనే విషయం మా అందరి మదిలో ఏర్పడింది. కాకపోతే కివీస్ పర్యటన తర్వాత మేము సరైన సమయంలోనే ఇక్కడికి రావడం మంచిదైంది. మేము వచ్చిన రోజు ప్రజలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలు పెట్టారు’ అని రవిశాస్త్రి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment