
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో మొనాకో ట్రాక్‌పై దూసుకెళ్లాడు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్ రేసులో అందరికంటే వేగంగా 1ని.10.810 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (1:11.039 సె.), మెర్సిడెజ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (1:11.232 సె.) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఆదివారం జరిగే ప్రధాన రేసును రికియార్డో తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. అతను ఇక్కడ పోల్ పొజిషన్ సాధించడం ఇది రెండో సారి. రెండేళ్ల క్రితం (2016) పోల్ సాధించినప్పటికీ తుది రేసులో మాత్రం రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. క్వాలిఫయింగ్‌లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ (1:12.061 సె.) ఆరో స్థానంలో, సెర్గియో పెరెజ్ (1:12.154 సె.) 9వ స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment